రూ. 25 చెల్లిస్తేనే.. పవర్‌స్టార్ ట్రైలర్

by  |
రూ. 25 చెల్లిస్తేనే.. పవర్‌స్టార్ ట్రైలర్
X

సంచలనాల దర్శకుడు వర్మ.. కథ దొరకడమే ఆలస్యం, వెంటనే టైటిల్ ప్రకటించేస్తాడు. నటీనటులను సిద్ధం చేసి.. ఏకంగా ట్రైలర్ రిలీజ్ చేస్తాడు. సినిమా కూడా షార్ట్ పీరియడ్‌లోనే కంప్లీట్ చేసి.. ఔరా అనిపిస్తాడు. అంతెందుకు లాక్‌డౌన్ టైమ్‌లోనూ క్లైమాక్స్, నేక్డ్, మర్డర్ లాంటి సినిమాలు తీసి బడా బడా ఫిల్మ్ మేకర్స్‌ను సైతం ఆశ్చర్యపరిచిన వర్మ.. ప్రస్తుతం పవర్ స్టార్ టైటిల్‌తో సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ఇది ఎవరి కథ అనేది బహిరంగ రహస్యమే. అయితే, తన సినిమాల విడుదలకు ‘ఆర్జీవీ వరల్డ్‌’ను స్థాపించుకుని సెన్సార్‌షిప్ లేకుండా చూసుకున్న వర్మ.. ప్రపంచంలో ఫస్ట్ పెయిడ్ ట్రైలర్‌ను విడుదల చేస్తూ సంచలనం సృష్టిస్తున్నాడు. ఈ మేరకు పవర్ స్టార్ ట్రైలర్ చూడాలంటే.. 25 రూపాయలు చెల్లించాలని చెబుతున్నాడు.

వివాదాలతోనే తన సినిమాలకు పబ్లిసిటీ తెచ్చుకోవడంలో, అభిమానుల్లో నెలకొన్న క్రేజ్‌ను వాడుకోవడంలో వర్మను మించిన మేధావి లేడన్నది సుస్పష్టం. పవర్ స్టార్ సినిమా విషయంలోనూ మరోసారి తన మార్క్ చూపించారు. ఆర్జీవీ వ‌ర‌ల్డ్ థియేటర్‌లో జులై 25న ఉద‌యం 11 గంట‌ల‌కు ప్ర‌పంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ప‌వ‌ర్ స్టార్ సినిమా గురించి ప్ర‌స్తావించారు. ప్ర‌పంచంలోనే తొలిసారి ట్రైలర్ కోసం రూ. 25 క‌ట్టి చూడవచ్చన్నారు. ఇది ప్రపంచ సినీ చరిత్రలోనే కనివినీ ఎరుగని విషయమని, దీని క్రెడిట్ ఆర్జీవీ వరల్డ్‌కు దక్కుతుందని వ్యాఖ్యానించారు. పవర్‌స్టార్ ట్రైలర్‌కు సంబంధించిన బుకింగ్స్ ప్రారంభమైన‌ట్లు తెలిపారు. ఈ సినిమా జులై 25 శ‌నివారం ఉద‌యం 11గంట‌ల‌కు విడుద‌ల చేస్తున్న‌ట్లు తెలిపిన ఆర్జీవీ.. దానికంటే ముందు జులై 22న సినిమా ట్రైలర్‌ను విడుద‌ల చేస్తున్నామ‌ని, అందుకోసం రూ.25 క‌ట్టిచూడాల‌ని సూచించారు. సినిమా చూసేందుకు అదే రోజు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలవుతాయన్నారు. జులై 25న సినిమా విడుద‌ల చేస్తున్నామ‌ని రూ. 150తో పాటు జీఎస్టీ క‌ట్టి టికెట్ల‌ను బుక్ చేసుకోవ‌చ్చ‌న్నారు. ఈ ఆఫ‌ర్ జులై 25 ఉద‌యం 11గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే ఉంటుందని తెలిపారు. అడ్వాన్స్ బుకింగ్ చేసుకోకపోతే.. సినిమా థియేటర్‌లో బ్లాక్ టికెట్లు కొన్న‌ట్లు కొనాల్సి వ‌స్తుందంటూ ఆర్జీవీ ఈ ప‌వ‌ర్ స్టార్ సినిమా విడుద‌ల గురించి ఆడియో టేప్‌ను విడుద‌ల చేశారు. 25 జూలై తర్వాత దీని రేటును రూ.250గా చేస్తున్నట్లు ప్రకటించాడు. కాగా, ఇప్పటికే ‘క్లైమాక్స్’ అనే సినిమాకు 100 రూపాయలు.. ఆ తర్వాత ‘నేక్డ్’ అనే మరో సినిమాకు 200 రూపాయలు టికెట్ పెట్టిన సంగతి తెలిసిందే.



Next Story

Most Viewed