- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీకు డిపాజిట్లు కూడా రానివ్వను.. ఇదే నా ఛాలెంజ్
<p>దిశ, వెబ్ డెస్క్ : తృణముల్ కాంగ్రెస్ మహిళా నేత సుజాతా మొండల్ మరోసారి హాట్ టాపిగ్గా మారారు. బీజేపీ ఎంపీ సౌమిత్రా ఖాన్ భార్య సుజాతా మొండల్ ఖాన్ ఇటీవల తృణముల్ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. సుజాతా మొండల్ టీఎంసీలో చేరికపై ఆమెభర్త బీజేపీ ఎంపీ సౌమిత్రాఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భార్యకు విడాకులు ఇస్తానంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ రణరంగానికి వేదికగా మారాయి. కాగా వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్‌లో 294 […]</p>

దిశ, వెబ్ డెస్క్ : తృణముల్ కాంగ్రెస్ మహిళా నేత సుజాతా మొండల్ మరోసారి హాట్ టాపిగ్గా మారారు. బీజేపీ ఎంపీ సౌమిత్రా ఖాన్ భార్య సుజాతా మొండల్ ఖాన్ ఇటీవల తృణముల్ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. సుజాతా మొండల్ టీఎంసీలో చేరికపై ఆమెభర్త బీజేపీ ఎంపీ సౌమిత్రాఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భార్యకు విడాకులు ఇస్తానంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ రణరంగానికి వేదికగా మారాయి. కాగా వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్‌లో 294 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన తృణముల్ కాంగ్రెస్ ప్రచారం నిర్వహించింది. ఈ ప్రచారంలో సుజాతా మొండల్ ఇటీవల టీఎంసీ నుంచి బీజేపీ లో చేరిన సువేందు అధికారికి సవాల్ విసిరారు. 294 అసెంబ్లీ స్థానాల్లో ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా పోటీ చేస్తా. సువేందు అధికారికి డిపాజిట్ రాకుండా చేస్తా. నువ్వు ఈ సవాల్ అంగీకరించకపోతే భయపడ్డాడని నేను నమ్ముతానంటూ సుజాతా మొండల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వెస్ట్ బెంగాల్ రాష్ట్ర రాజకీయాల్ని హీటెక్కిస్తున్నాయి.






