కరోనాతో ఎమ్మెల్యే మృతి

by Vadlamudi Anukaran |   (  Updated:2020-08-17 07:09:59  IST  )

<p>కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సమరేష్ దాస్(74) సోమవారం ఉదయం కన్నుమూశారు. కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలిన సుమారు నెల తర్వాత కోల్‌కతా సాల్ట్‌లేక్‌లోని ఏఎంఆర్ఐ ఆసుపత్రిలో ఆయన ఈ రోజు తుదిశ్వాస విడిచారు. ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లా ఎగ్రా నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొనసాగిన సమరేష్ దాస్‌కు గతనెల 18న కరోనా పాజిటివ్‌గా తేలింది. వెంటనే స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. అనంతరం 25న ఏఎంఆర్ఐకి తరలించారు. ఆయన ఆరోగ్యం విషమించడంతో వెంటిలేటర్ సపోర్ట్ ఇచ్చినట్టప్పటికీ సోమవారం కన్నుమూశారు. [&hellip;]</p>

కరోనాతో ఎమ్మెల్యే మృతి
X

కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సమరేష్ దాస్(74) సోమవారం ఉదయం కన్నుమూశారు. కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలిన సుమారు నెల తర్వాత కోల్‌కతా సాల్ట్‌లేక్‌లోని ఏఎంఆర్ఐ ఆసుపత్రిలో ఆయన ఈ రోజు తుదిశ్వాస విడిచారు.

ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లా ఎగ్రా నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొనసాగిన సమరేష్ దాస్‌కు గతనెల 18న కరోనా పాజిటివ్‌గా తేలింది. వెంటనే స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. అనంతరం 25న ఏఎంఆర్ఐకి తరలించారు. ఆయన ఆరోగ్యం విషమించడంతో వెంటిలేటర్ సపోర్ట్ ఇచ్చినట్టప్పటికీ సోమవారం కన్నుమూశారు. కరోనాతో కన్నుమూసిన రెండో ఎమ్మెల్యే సమరేష్ దాస్. జూన్‌లో టీఎంసీ ఎమ్మెల్యే తమొనాష్ గోష్(60) కరోనా కారణంగా మరణించిన విషయం తెలిసిందే.

Next Story