- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుపతిలో ఫాల్గుణ లక్ష్మీ వైభవం-లక్ష్మీ జయంతి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : టీటీడీ తలపెట్టిన ఫాల్గుణ మాస ఉత్సవాల్లో భాగంగా మార్చి 28వ తేదీ ఆదివారం తిరుపతిలో ఫాల్గుణ లక్ష్మీ వైభవం- లక్ష్మీ జయంతి కార్యక్రమం జరగనున్నట్లు నిర్వహకులు తెలిపారు. సాయంత్రం 6 నుండి రాత్రి 7.45 గంటల వరకు జరుగనున్న కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. టీటీడీ ఇప్పటివరకు నిర్వహించిన కార్తీక, ధనుర్, మాఘ మాస ఉత్సవాలకు భక్తుల నుండి విశేషాదరణ లభించింది. ఇదే తరహాలో ఫాల్గుణ మాస […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : టీటీడీ తలపెట్టిన ఫాల్గుణ మాస ఉత్సవాల్లో భాగంగా మార్చి 28వ తేదీ ఆదివారం తిరుపతిలో ఫాల్గుణ లక్ష్మీ వైభవం- లక్ష్మీ జయంతి కార్యక్రమం జరగనున్నట్లు నిర్వహకులు తెలిపారు. సాయంత్రం 6 నుండి రాత్రి 7.45 గంటల వరకు జరుగనున్న కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
టీటీడీ ఇప్పటివరకు నిర్వహించిన కార్తీక, ధనుర్, మాఘ మాస ఉత్సవాలకు భక్తుల నుండి విశేషాదరణ లభించింది. ఇదే తరహాలో ఫాల్గుణ మాస ఉత్సవాలను నిర్వహిస్తోంది. కార్యక్రమంలో భాగంగా వేదస్వస్తి, లక్ష్మీ జయంతి ప్రాశస్త్యం, మహాలక్ష్మీపూజ, స్తోత్ర పఠనం-మహాలక్ష్మీ అష్టకం, నృత్యం, గోవిందనామాలతో సామూహిక దీపారాధనం, మంగళహారతి నిర్వహిస్తారు.
Next Story






