ఈ పండ్లు తింటే నార్మల్ డెలివరీ ఖాయం: వైద్య నిపుణులు!

617
narmal-Delivery

దిశ, వెబ్ డెస్క్: చాలా మంది గర్భిణీలు డెలివరీ విషయమై ఆందోళన చెందుతుంటారు. నార్మల్ డెలివరీ అయితదా..? లేదా? అని టెన్షన్ పడుతుంటారు. గర్భిణీలే కాదు వారి బంధువులు కూడా ఆందోళన చెందుతుంటారు. నార్మల్ డెలివరీ కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. అందుకోసం వైద్యనిపుణులు, ఇతరుల సలహాలు, సూచనలు పాటిస్తుంటారు. అయితే, డెలివరీ చివరి టైంలో కొన్ని పండ్లను తీసుకుంటే కూడా నార్మల్ డెలివరీ అవ్వడానికి అవి ఎంతగానో దోహదం చేస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

అవేమిటంటే.. పైనాపిల్, పచ్చిబొప్పాయి, ఖర్జూరం, రెడ్ స్ట్రాబెర్రీ లీఫ్. ఈ పండ్లను డెలివరీ చివరి సమయంలో తీసుకుంటే నార్మల్ డెలివరీకి ఎంతో దోహపడుతాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పచ్చి బొప్పాయిని ప్రెగ్నెన్సీ వచ్చిన మొదట్లో అస్సలు తీసుకోవొద్దని, ఆఖరి రోజుల్లో మాత్రం ఇది తీసుకుంటే నార్మల్ డెలివరీకి ఎంతగానో దోహదపడుతుందని తెలుపుతున్నారు. అదేవిధంగా పైనాపిల్ ను కూడా డెలివరీ ఆఖరి రోజుల్లో తీసుకుంటే ఇది నార్మల్ డెలివరీ అయ్యేందుకు గర్భిణీ మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అదేవిధంగా ఖర్జూరంలో కూడా ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల వాటిని తీసుకుంటే నార్మల్ డెలివరీ అయ్యే అవకాశముందని సూచిస్తున్నారు. అయితే, గెస్టేషనల్ డయాబెటిస్ ఉన్న ప్రెగ్నెన్సీ మహిళలు మాత్రం ఖర్జూరం తీసుకోవద్దని సూచిస్తున్నారు. రెడ్ స్ట్రాబెర్రీ లీఫ్ ను కూడా డెలివరీ ఆఖరి రోజుల్లో టీ రూపంలో తీసుకుంటే నార్మల్ డెలివరీకి ఎంతగానో దోహదం చేస్తుందని వైద్యనిపుణులు చెబుతున్నారు.

n-delivery-2

మరోటి ఏమిటంటే.. గర్భిణీ మహిళలు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలని, ఆరోగ్యకరమైన పద్ధతులు పాటించాలని, ఎటువంటి ఒత్తిడికి లోనవ్వకుండా ఆనందంగా ఉండాలని… ఈ సూచనలన్నీ కూడా నార్మల్ డెలివరీ అయ్యేందుకు ఎంతగానో దోహదం చేస్తాయని వారు చెబుతున్నారు.

ముఖ్యంగా గమనించాల్సిన విషయమేమిటంటే.. వైద్యనిపుణులు, ఇతర అధ్యయనాల ప్రకారం మీకు అవగాహన కల్పించేందుకు ఈ వివరాలను అందించాం. ఆరోగ్యపరంగా ఏ చిన్న సమస్య ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించమే ఉత్తమమైన మార్గం. గమనించగలరు.

శనగలతో ఆరోగ్యం.. బ్రేక్ ఫాస్ట్‌కు ముందు తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా ?

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..