టిండర్‌లో ‘కాంటాక్ట్స్’ను ఈ ఫీచర్‌తో బ్లాక్ చేయెచ్చు..

by  |
టిండర్‌లో ‘కాంటాక్ట్స్’ను ఈ ఫీచర్‌తో బ్లాక్ చేయెచ్చు..
X

దిశ, ఫీచర్స్ : ప్రముఖ డేటింగ్ యాప్ ‘టిండర్’ తమ వినియోగదారుల కోసం ఓ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఈ ఫీచర్ మిమ్మల్ని తెలిసిన వ్యక్తులను డేటింగ్ యాప్‌లో కనుగొనకుండా నిరోధిస్తుంది.నిత్య జీవితంలో ఎంతోమందితో మనకు పరిచయాలు ఏర్పడతాయి. అలా అని మన పర్సనల్ లైఫ్‌లో, సోషల్ మీడియా అకౌంట్స్‌లో వారికి స్థానం ఇవ్వాలా? వద్దా? అన్నది మన ఇష్టంపై ఆధారపడి ఉంటుంది.

అంతేకాదు ఈ జాబితాలో ఎక్స్ బాయ్‌ఫ్రెండ్, కొలిగ్స్, రిలేటివ్స్‌ కూడా ఉంటారు. అయితే కొందరు టిండర్ లాంటి డేటింగ్ యాప్‌లో మనకు తెలిసినవాళ్లు ఎవరైనా ఉన్నారో లేదో తెలుసుకునేందుకు తమ కాంటాక్ట్స్, ప్రొఫైల్ ఆధారంగా సెర్చ్ చేస్తుంటారు. ఇది పూర్తిగా ఒకరి వ్యక్తిగత వేదిక. దానిగురించి మనకు మనముగా ఇతరులకు చెప్పాలని నిర్ణయించుకుంటే తప్ప దీని గురించి తెలుసుకోవడానికి సాధారణంగా ఇష్టపడం. ఇటీవల టిండర్ సర్వే ప్రకారం 40 శాతం మంది రెస్పాండెట్స్ డేటింగ్ అనువర్తనంలో ఎక్స్ పార్టనర్‌ను కనుగొన్నారు.

అదేవిధంగా 24 శాతం మంది కుటుంబ సభ్యుడిని లేదా సహోద్యోగిని యాప్‌లో చూశారు. టిండర్ ఈ సమస్యకు చెక్ చెప్పేందుక న్యూ ఫీచర్ తీసుకొచ్చింది. ఇందుకోసం టిండర్ మొదటగా యూజర్ కాంటాక్ట్ లిస్ట్ అడుగుతుంది, వారి అనుమతితో అందులోని అన్‌వాంటెడ్ కాంటాక్ట్స్‌ను బ్లాక్ చేస్తుంది.
ఈ ప్రక్రియ మొత్తం వలంటీర్‌గా జరుగుతుంది. యూజర్ బ్లాక్ చేయాలని చెప్పిన నెంబర్లను మాత్రమే ఇది నిరోధిస్తుంది. అంతేకాదు మీరు వారిని బ్లాక్ చేసినట్లు కూడా వారికి తెలియదు. ఒకవేళ సదరు పర్సన్ వేరే కాంటాక్ట్ నెంబర్లతో సంప్రదిస్తే దానికి టిండర్ బాధ్యత కాదు.

ఎలా చేయాలి?

టిండర్‌‌లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పరిచయాలను నిరోధించడానికి, మొదట, యాప్ ఓపెన్ చేసి సెట్టింగ్‌లకు వెళ్ళండి. ఇక్కడ, మీరు ‘బ్లాక్ కాంటాక్ట్స్’ ఆప్షన్ కనుగొనే వరకు క్రిందికి స్క్రోల్ చేయండి. మీ కాంటాక్ట్ డేటాబేస్‌కు యాప్ యాక్సెస్ ఇవ్వాలి. ఇది పూర్తయిన తర్వాత వినియోగదారులు వారి కాంటాక్ట్ జాబితాను చూస్తారు. యాప్‌లో ఏ పరిచయాలను నిరోధించాలో మాన్యువల్‌గా ఎంచుకోవచ్చు. వినియోగదారులు అన్ని కాంటాక్ట్స్‌ను కూడా ఎంచుకోవచ్చు. సేవ్ చేసిన అన్ని నెంబర్స్‌ను కూడా వారి ప్రొఫైల్‌ను కనుగొనకుండా నిరోధించవచ్చు. ‘బ్లాక్డ్’ టాబ్‌కు వెళ్లి అన్‌బ్లాక్ బటన్‌ను ఎంచుకోవడం ద్వారా మీరు బ్లాక్ చేసిన పరిచయాన్ని తిరిగి అన్‌లాక్ చేయవచ్చు.


Next Story