విదేశాలకు 6.45 కోట్ల డోసుల ఎగుమతి : కేంద్రం

by  |
విదేశాలకు 6.45 కోట్ల డోసుల ఎగుమతి : కేంద్రం
X

న్యూఢిల్లీ : దేశంలో కరోనా టీకా డోసుల కొరత తీవ్ర సమస్యగా పరిణమిస్తుండగా విదేశాలకు ఎగుమతులను నిలిపేయాలన్న డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ కీలక వివరాలు వెల్లడించారు. ఇప్పటి వరకు భారత్ 6.45 కోట్ల డోసులను విదేశాలకు పంపించిందని వివరించారు. వీటిని 84 దేశాలకు పంపించామని తెలిపారు. ఇందులో 1.05 కోట్ల డోసులను 44 దేశాలకు గ్రాంట్లుగా పంపామని పేర్కొన్నారు. 3.58 కోట్ల డోసులు 25 దేశాలకు కమర్షియల్ కాంట్రాక్టు కింద పంపించామని చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన కొవాక్స్ ఫెసిలిటీ కింద 1.82 కోట్ల డోసులను 39 దేశాలకు తరలించినట్టు వెల్లడించారు.

ఇప్పటి వరకు 9.43 కోట్ల డోసుల పంపిణీ..

ఇప్పటి వరకు దేశంలో సుమారు 9.43 కోట్ల డోసులను పంపిణీ చేసినట్టు కేంద్ర ప్రభుత్వం ఈ రోజు మధ్యాహ్నం ఓ ప్రకటనలో వెల్లడించింది. 14,28,500 సెషన్‌లలో 9,43,34,262 డోసులు వేశామని తెలిపింది. ఇవి ఫస్ట్, సెకండ్ డోసులను కలుపుకుని మొత్తంగా పంపిణీ చేసిన డోసుల సంఖ్య.


Next Story

Most Viewed