- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెంచికలపేట్ ప్రధాన రోడ్డుపైకి వచ్చిన పెద్దపులి..
<p>దిశ, బెజ్జూర్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పెంచికల్ పేట్, బెజ్జూరు ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న లోడ్ పెళ్లి సులుగుపల్లి గ్రామ సమీపంలో శనివారం సాయంత్రం పెద్దపులి కలకలం సృష్టించింది. వివరాల్లోకివెళితే.. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట్ ప్రధాన రహదారిపై పెద్దపులి కనిపించడంతో అటుగా వెళ్లే ద్విచక్ర వాహనదారులు, ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పెంచికల్ పేట్ మండలం ఎల్కపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంకటేష్ మండల పరిషత్ కార్యాలయంలో ఆపరేటర్‌గా పనిచేస్తున్న ఆత్రం అశోక్‌తో […]</p>

దిశ, బెజ్జూర్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పెంచికల్ పేట్, బెజ్జూరు ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న లోడ్ పెళ్లి సులుగుపల్లి గ్రామ సమీపంలో శనివారం సాయంత్రం పెద్దపులి కలకలం సృష్టించింది. వివరాల్లోకివెళితే.. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్ పేట్ ప్రధాన రహదారిపై పెద్దపులి కనిపించడంతో అటుగా వెళ్లే ద్విచక్ర వాహనదారులు, ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
పెంచికల్ పేట్ మండలం ఎల్కపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంకటేష్ మండల పరిషత్ కార్యాలయంలో ఆపరేటర్‌గా పనిచేస్తున్న ఆత్రం అశోక్‌తో పెంచికల్ పేట్ నుండి ద్విచక్ర వాహనంపై బెజ్జూర్ మండలానికి వస్తున్నారు. ఈ క్రమంలోనే లోడ్ పెళ్లి సులుగుపల్లి అటవీ ప్రాంతంలో పెద్దపులి గొల్ల దేవర వద్ద కనిపించింది. దీంతో వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.పెద్దపులి కనిపించడంతో కొంతసేపు అక్కడే వేచి ఉన్నారు. గతంలో ఈ అటవీ ప్రాంతంలోని ప్రధాన రహదారిపై ఎన్నో సార్లు పెద్దపులి ఎదురువచ్చిన ఘటనలు అనేకం ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు.
- Tags
- Bejjur






