కెమెరాకు చిక్కిన పెద్దపులి..

by  |
కెమెరాకు చిక్కిన పెద్దపులి..
X

దిశ, వెబ్‌డెస్క్ :

ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం మరోసారి కలకలం రేపింది. జిల్లాలోని భీంపూర్ మండలం తాంసి(కె) అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచిరిస్తుండగా దాని కదలికలు అటవీ శాఖ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

అంతకుముందు మేత కోసం వెళ్లిన పశువుల సమూహంపై పెద్దపులి దాడి చేసినట్లు గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.ఈ మేరకు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన అధికారులకు పులి కదలికలు కనిపించాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ హెచ్చరికలు జారీచేసింది.



Next Story

Most Viewed