గురువారం పంచాంగం, రాశి ఫలాలు (22-04-2021)

by  |
Panchangam Rasi phalalu
X

శ్రీ ప్లవ నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు
చైత్ర మాసం శుక్ల పక్షం
తిధి : దశమి సా 6.31 తదుపరి ఏకాదశి
వారం : గురువారం(బృహస్పతివాసరే)
నక్షత్రం :మఖ తె 3.20
యోగం : గండం మ 12.49 తదుపరి వృద్ధి
కరణం : తైతుల ఉ 6.48 తదుపరి గరజి సా 6.31 ఆ తదుపరి వణిజ
వర్జ్యం : మ 3.22 – 4.57
దుర్ముహూర్తం : ఉ 9.53 – 10.43 &
మ 2.53 – 3.43
అమృతకాలం : రా 12.56 – 2.32
రాహుకాలం : మ 1.30 – 3.00
యమగండం/కేతుకాలం : ఉ 6.00 – 7.30
సూర్యరాశి : మేషం
చంద్రరాశి : సింహం
సూర్యోదయం : 5.44 సూర్యాస్తమయం : 6.13

రాశి ఫలితాలు

మేషం

ఇంట బయట ఒత్తిడి పెరుగుతుంది.అనారోగ్య సమస్య బాధిస్తాయి. ఇతరుల వలన విరోధం పెరుగుతుంది. విలువైన వస్తువులు విషయంలో జాగ్రత్త వహించాలి. వృత్తి ఉద్యోగాలలో పనిభారం పెరుగుతుంది. సంతాన విద్యా సంబంధిత విషయాలలో సమస్యలు కలుగుతాయి.

వృషభం

కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. మానసిక సమస్యలు అధికమవుతాయి. అవసరానికి డబ్బు లభించక ఇబ్బంది పడతారు. వృత్తి వ్యాపారాలలో అడ్డంకులు ఏర్పడతాయి. ఉద్యోగమున శత్రు సంభందమైన ఇబ్బందులు కలుగుతాయి.

మిధునం

విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. అన్ని వైపులా నుండి ధన లాభం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం నుండి ఉపశమనం పొందుతారు. దూర ప్రాంతాల నుండి శుభ వార్తలు అందుతాయి.

కర్కాటకం

ఆర్ధిక ఇబ్బందులు కలుగుతాయి. సౌకర్యాలకు ఇబ్బంది లేకున్నా ఇతరుల వలన ఇబ్బందులుంటాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో అకారణంగా విభేదాలుకలుగుతాయి. నేత్ర సంభందిత అనారోగ్య సమస్యలు భాధిస్తాయి. వృత్తి ఉద్యోగాలు చికాకు పెరుగుతాయి.

సింహం

సమాజంలో ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.ఇంట బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. సంతాన విద్యా విషయాలు అనుకూలంగా సాగుతాయి.

కన్య

ఇంటబయట నూతన సమస్యలు కలుగుతాయి. చేపట్టిన శ్రమాధిక్యతతో కానీ పనులు పూర్తి కావు.మానసిక సమస్యలు భాధిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా పడతాయి వ్యాపారాలునిరాశకలిగిస్తాయి.ఉద్యోగమున అదనపు భాద్యతలు ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

తుల

వృత్తి ఉద్యోగాలలో కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. సమాజంలో పెద్దల నుండి సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. రావలసిన బాకీలు వసూలవుతాయి. వ్యాపార లాభసాటిగా సాగుతాయి. ముఖ్యమైన పనులలో బందు మిత్రులసహకారం లభిస్తుంది. ఆర్ధిక అనుకూలత కలుగుతుంది.

వృశ్చికం

అధికారులతో చర్చలకు అనుకూల సమయం. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు అందుతాయి. వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. గృహోప కరణాలు కొనుగోలు చేస్తారు పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు జీవిత భాగస్వామి నుండి ధన సహాయం లభిస్తుంది.

ధనస్సు

దూర ప్రయాణాల వలన అలసట పెరుగుతుంది. కుటుంబమున చికాకులు అధికమవుతాయి. సోదరులు తో స్ధిరాస్తివివాదాలుకలుగుతాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. విద్యార్థుల కష్టానికి తగిన ఫలితం ఉండదు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన విశ్రాంతి లభించదు.

మకరం

వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. వాహన ప్రయాణాలలో ప్రమాద సూచనలు ఉన్నవి. చేపట్టిన పనులలో సమయానికి పూర్తికావు నిరుత్సాహం పెరుగుతుంది. ఆర్ధిక నష్టములు ఉంటాయి. ఉద్యోగమున చెయ్యని పనికి అధికారుల నుండి నిందలు పడతారు.

కుంభం

చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. విందు వినోదాది కార్యక్రమాలలో హాజరు అవుతారు. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. వృత్తి వ్యాపారాలు మరింత అభివృద్ధి కలుగుతుంది.

మీనం

నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. అన్ని వైపుల నుండి అదాయం ఉంటుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలుపొందుతారు. వృత్తి ఉద్యోగాలలో కష్టానికి తగిన ప్రతిఫలం అందుతుంది. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు సమాజంలో పెద్దల ఆదరణ పొందుతారు. ​


Next Story

Most Viewed