- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తండ్రీకూతుళ్లపై దుండగుల దాడి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలులో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న తండ్రి కూతుళ్లపై అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. వివరాల్లోకి వెళ్తే.. సీతారామయ్య శంఖవరం మండలం నెల్లిపూడి అగ్రహారం ప్రాథమిక పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. గురువారం అర్థరాత్రి ఎవరో తలుపు కొట్టడంతో.. తలుపు తెరిచిన సీతారామయ్యపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. తండ్రిపై దాడిని అడ్డుకున్న కూతురు ధనశ్రీపై దాడి చేశారు. సీతారామయ్య భార్య గట్టిగా […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలులో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న తండ్రి కూతుళ్లపై అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. సీతారామయ్య శంఖవరం మండలం నెల్లిపూడి అగ్రహారం ప్రాథమిక పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. గురువారం అర్థరాత్రి ఎవరో తలుపు కొట్టడంతో.. తలుపు తెరిచిన సీతారామయ్యపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. తండ్రిపై దాడిని అడ్డుకున్న కూతురు ధనశ్రీపై దాడి చేశారు. సీతారామయ్య భార్య గట్టిగా కేకలు వేయడంతో దుండగులు పరారయ్యారు. క్షతగాత్రులను పిఠాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






