- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రాణం తీసిన స్నానం సరదా..ముగ్గురు మృతి
<p>దిశ, వెబ్ డెస్క్: తూర్పుగోదావరి జిల్లాలో విషాదం నెలకొంది. స్నానం చేద్దామని గోదావరిలో దిగిన ముగ్గురు యువకులు మృతి చెందారు. ఈ ఘటన గేదెల్లంకలో చోటు చేసుకుంది. మృతి చెందిన ముగ్గురు యువకులు డి.ఫణి(18), కె.సాగర్(17), ఎం.బాలు(18) గా పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే అమలాపురం రూరల్ మండలం బట్నవిల్లి శెట్టిపేటకు చెందిన ఈ ముగ్గురు యువకులు కనిపించకుండా పోయారు. యువకులు కనిపించడంలేదంటూ అమలాపురం రూరల్ పోలీస్ స్టేషన్ లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కేసు […]</p>

దిశ, వెబ్ డెస్క్: తూర్పుగోదావరి జిల్లాలో విషాదం నెలకొంది. స్నానం చేద్దామని గోదావరిలో దిగిన ముగ్గురు యువకులు మృతి చెందారు. ఈ ఘటన గేదెల్లంకలో చోటు చేసుకుంది. మృతి చెందిన ముగ్గురు యువకులు డి.ఫణి(18), కె.సాగర్(17), ఎం.బాలు(18) గా పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే అమలాపురం రూరల్ మండలం బట్నవిల్లి శెట్టిపేటకు చెందిన ఈ ముగ్గురు యువకులు కనిపించకుండా పోయారు. యువకులు కనిపించడంలేదంటూ అమలాపురం రూరల్ పోలీస్ స్టేషన్ లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
అయితే ముమ్మిడివరం మండలం గేదెల్లంక గోదావరిలో యువకుడు మృతదేహం లభించిందని సమాచారం రావడంతో కుటుంబ సభ్యులతోపాటు పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అదృశ్యమైన యువకులలో ఒకరిది ఆ మృతదేహం అని పోలీసులు గుర్తించారు. గోదావరిలో గాలించగా మరో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. పుష్కరఘాట్ లో స్థానానికి వచ్చి ప్రమాదవ శాత్తు గోదావరిలో మునిగి మృతిచెంది ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు విగతజీవులుగా మారడంతో కుటుంబంలో విషాదచ్ఛాయలు అలుముకున్నాయి.






