- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్వారీలో విషాదం.. ముగ్గురు కార్మికులు మృతి
by Shyam |
<p>దిశ, కాజీపేట : హన్మకొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. క్వారీలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు కార్మికులు మృతిచెందారు. ఈ సంఘటన శనివారం మధ్యాహ్నం జిల్లాలోని కాజీపేట మండలం తరాలపల్లి శివారు గాయత్రి క్వారీలో జరిగింది. వేగంగా ప్రయాణిస్తున్న టిప్పర్ అదుపు తప్పి పని చేస్తున్న ముగ్గురు కార్మికులపై పడటంతో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మృతిచెందిన వారిలో మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తికి చెందిన చందు, గూడురు […]</p>

X
దిశ, కాజీపేట : హన్మకొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. క్వారీలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు కార్మికులు మృతిచెందారు. ఈ సంఘటన శనివారం మధ్యాహ్నం జిల్లాలోని కాజీపేట మండలం తరాలపల్లి శివారు గాయత్రి క్వారీలో జరిగింది. వేగంగా ప్రయాణిస్తున్న టిప్పర్ అదుపు తప్పి పని చేస్తున్న ముగ్గురు కార్మికులపై పడటంతో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మృతిచెందిన వారిలో మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తికి చెందిన చందు, గూడురు మండలం బొద్దుగొండకు చెందిన ముఖేష్, జార్ఖండ్ కు చెందిన అఖీమ్ ఉన్నారు. మృతదేహాలను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






