- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి
by Batti.Sumithra |
<p>దిశ, షాద్‌నగర్: రోడ్డు ప్రమాదం ముగ్గురి ప్రాణాలను బలితీసుకుంది. హైవేను దాటుతుండగా కారు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా నందిగామ జాతీయ రహదారి మేకగూడ క్రాస్ వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ప్రైవేట్ కంపెనీలో విధులు ముగించుకొని.. షాపూర్ పరిధి హల్లికల్ తండాకు చెందిన పాత్లావత్ అరుణ (40), మదనపల్లి పాత తండాకు చెందిన వర్తియా సక్కు(28), వర్తియా లల్లి(29) ముగ్గురు మహిళలు ఇంటికి […]</p>

X
దిశ, షాద్‌నగర్: రోడ్డు ప్రమాదం ముగ్గురి ప్రాణాలను బలితీసుకుంది. హైవేను దాటుతుండగా కారు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా నందిగామ జాతీయ రహదారి మేకగూడ క్రాస్ వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ప్రైవేట్ కంపెనీలో విధులు ముగించుకొని.. షాపూర్ పరిధి హల్లికల్ తండాకు చెందిన పాత్లావత్ అరుణ (40), మదనపల్లి పాత తండాకు చెందిన వర్తియా సక్కు(28), వర్తియా లల్లి(29) ముగ్గురు మహిళలు ఇంటికి బయల్దేరారు. ఇదే క్రమంలో రోడ్డు దాటుతుండగా.. మహబూబ్‌నగర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు వీరిని ఢీ కొట్టింది. దీంతో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టామన్నారు.
Next Story






