ఫలక్‌నుమాలో విషాదం

5

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌ మహానగరంలో వర్షాలు విషాదాన్ని నింపుతున్నాయి. వరదల బీభత్సానికి నగరవాసులు ప్రాణాలు కోల్పోతున్నారు. పాతబస్తీ ఫలక్‌నుమాలో భారీ వర్షాలు ముగ్గురిని పొట్టనబెట్టుకున్నాయి. ఇంట్లోకి వరద నీరు చేరడంతో ఇద్దరు మృతి చెందగా.. గోడకూలిన ఘటనలో మరొక వ్యక్తి చనిపోయాడు. సమాచారం అందుకున్న అధికారులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు.