దేశంలో మూడు రకాల కరోనా వైరస్!

by  |
దేశంలో మూడు రకాల కరోనా వైరస్!
X

దిశ, వెబ్‌డెస్క్: ఇప్పటివరకు భారతదేశంలో మూడు రకాల కరోనా వైరస్‌ను గుర్తించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చీ (ఐసీఎంఆర్) వెల్లడించింది. అయితే దీని వల్ల డ్రగ్ వాడకానికి ఎలాంటి అడ్డంకి తలెత్తకపోయినప్పటికీ, వాక్సిన్ సామర్థ్యం మీద ప్రభావం చూపించే అవకాశం ఉందని ఐసీఎంఆర్ ఎపిడెమియాలజీ హెడ్ డాక్టర్ ఆర్ ఆర్ గంగఖేద్కర్ అన్నారు.

ఈ వైరస్ విదేశాల నుంచి భారత్‌లో ప్రవేశించిన కారణంగా ఒక్కో మ్యూటేషన్ కలిగి ఉంది. తొలి కేసు వుహాన్ నుంచి తీసుకువచ్చిన విద్యార్థుల నుంచి వ్యాపించింది కాబట్టి అందులో చైనా రకం వైరస్ ఉందని, తర్వాతి కేసులు ఇటలీ, ఇరాన్ ప్రాంతం నుంచి వచ్చిన నేపథ్యంలో చైనా రకం వైరస్‌తో కొద్ది తేడాలు ఇందులో ఉన్నాయి. ఇక మూడో రకం అమెరికా నుంచి ఇండియాకు వచ్చినదని గంగఖేద్కర్ తెలిపారు. అయితే వీటిలో ఎక్కువ ప్రబలిన రకం ఏదనే విషయం గురించి ఇంకొన్ని రోజుల్లో స్పష్టత వస్తుందని, ప్రస్తుతానికి ఈ మూడింటి మీద పని చేస్తున్న డ్రగ్‌తో సమస్య లేదని, కానీ వ్యాక్సిన్ తయారీలో ప్రభావం కనిపిస్తుందని ఆయన చెప్పారు. ఇక్కడ అదృష్టం కలిగిస్తున్న విషయం ఏంటంటే ఈ వైరస్ మ్యూటేషన్ వేగం చాలా తక్కువగా ఉండటం. ఒకవేళ మ్యూటేషన్ వేగం అధికంగా ఉండి ఉంటే ఇప్పటికి ఇది మూడు వందల రకాలుగా పరిణామం చెంది, తీవ్రనష్టాన్ని కలిగించేది. ప్రస్తుతానికి హైడ్రాక్సీక్లోరోక్విన్ ఉపయోగించడం వల్ల ఈ మూడు రకాల వైరస్‌లు సరిగానే స్పందిస్తున్నాయని ఆయన వివరించారు.

Tags – Corona, covid, Virus strains, Drug, Vaccine, ICMR, China, Wuhan


Next Story

Most Viewed