- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఆ నింద తట్టుకోలేక పనిమనిషి ఆత్మహత్యాయత్నం.. ప్రముఖ నిర్మాతపై పోలీసు కేసు!
దిశ, సినిమా: సినీ నిర్మాత జ్ఞానవేల్ రాజాపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. నిర్మాత జ్ఞానవేల్ ఆమె భార్య కారణంగా వాళ్ల ఇంటి పనిమనిషి ఆత్మహత్యాయత్నం చేసుకుందని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అసలు ఏం జరిగిందంటే..? చెన్నైలోని త్యాగరాయ నగర్‌లోని జగదీశ్వరన్ వీధిలో నిర్మాత జ్ఞానవేల్ రాజా, భార్య నేహా ఉంటున్నారు. అయితే.. కొన్ని రోజుల క్రితం నిర్మాత ఇంట్లో కొన్ని బంగారం ఆభరణాలు కనిపించకుండా పోయాయి.
ఈ క్రమంలోనే జ్ఞానవేల్ భార్య నేహా.. వాళ్ల ఇంట్లో పని చేసే లక్ష్మి అనే ఆమెను అడిగింది. దీంతో లక్ష్మి పనికి రావడం మానేసింది. అంతే కాకుండా.. ఫోన్ కూడా స్విచ్ఛ్ ఆఫ్ చేసిందట. ఇక లక్ష్మిపై అనుమానం రావడంతో నేహా తన భర్తకు చెప్పింది. వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు జ్ఞానవేల్. పోలీసులు లక్ష్మిని విచారణకు పిలిచారు. ఈ క్రమంలోనే లక్ష్మి మనస్తపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసుకుందని ఆమె కూతురు నిర్మాత జ్ఞానవేల్, నేహాపై పోలీలకు ఫిర్యాదు చేసింది. నిర్మాతపై కేసు నమోదు కావడం సినీ పరిశ్రమలో తీవ్ర కలకలం రేపుతోంది.