- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రష్మిని చెప్పుతో కొడతానన్న నెటిజన్.. ఆమె రియాక్షన్ ఏంటంటే? (పోస్ట్ వైరల్)
దిశ, సినిమా: రష్మీ గౌతమ్ జబర్దస్త్ షో ద్వారా బుల్లితెరకు పరిచయం అయి ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. అంతేకాకుండా పలు సినిమాలు కూడా చేసి ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం ఈ అమ్మడు బుల్లితెరపై వరుస షోలు చేస్తూనే సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటుంది. జంతువులంటే ప్రాణం ఇచ్చే ఆ హాట్ యాంకర్ నిత్యం మూగ జీవాలపై జరిగే హింసకు సంబంధించిన సంఘటనల గురించి తనదైన స్టైల్లో స్పందిస్తుంది. అంతేకాకుండా పలు వీడియోలు షేర్ చేసి ఒక్కోసారి ట్రోల్స్ కూడా ఎదుర్కొంటూ ఉంటుంది. అయినప్పటికీ వాటిని పట్టించుకోకుండా జంతువుల కోసం పోరాటం ఆపదు.
ఇదిలా ఉంటే.. తాజాగా, రష్మి నెట్టింట వైరల్ అవుతున్న వీడియోపై స్పందించింది. అందులో ఓ వ్యక్తి గన్ను పట్టుకుని ఆవును షూట్ చేస్తూ ఉంటాడు. దీనిపై రష్మి.. హిందువులుగా ఇలాంటివి జరగనిచ్చి ఉండాల్సింది కాదు. ఇదంతా మన తప్పు వల్లే ఒక ఆవు ప్రాణాలు కోల్పోయింది అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్ కాస్త వైరల్ అవడంతో అది చూసిన ఓ నెటిజన్ ‘ ఎవతిరా ఇది అక్కడ ఆడవారిని బట్టలు ఊడదీసి నగ్నంగా ఊరేగిస్తూ రేప్ చేసి చంపేస్తున్నారు.
అలాగే చిన్న పిల్లలను కూడా వదలకుండా చంపేస్తుంటే అడగకుండా ఒక ఎద్దును చంపేస్తే అడుగుతుంది. చిన్న పిల్లలను చంపేస్తుంటే రెస్పాండ్ అవ్వదు ఏ చెప్పుతో కొట్టాలి’ అని రాసుకొచ్చాడు. దానికి రష్మీ గౌతమ్ స్పందిస్తూ.. ‘‘ బ్రెయిన్ వాడండి ఈ రోజు ఆవులు, ఎద్దులు, కాకులే రేపు మీ పిల్లలు. ఒక్కసారి మనిషి చంపడానికి సిద్ధం అయితే వాడికి పశువులకి తేడా ఏమి కనిపించదు. అక్కడ ఏ ధర్మం పనికి రాదు’’ అంటూ రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం రష్మీ గౌతమ్ పోస్ట్ వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.