ఫోన్ చేసి మరీ ఆ పనికి రమ్మన్నారు.. కాస్టింగ్ కౌచ్‌పై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

by Kavitha |
ఫోన్ చేసి మరీ ఆ పనికి రమ్మన్నారు.. కాస్టింగ్ కౌచ్‌పై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: సినిమా ఇండస్ట్రీలో పట్టి పీడిస్తున్న ఓ మహమ్మారి క్యాస్టింగ్ కౌచ్. అవకాశాలు కావాలంటే నిర్మాతల, డైరక్టర్ల అవసరాలు తీర్చాల్సి ఉంటుందని ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు బహిర్గతంగా క్యాస్టింగ్ కౌచ్‌పై ఓపెన్ అయ్యారు. అలాగే కమిట్మెంట్ ఇచ్చినప్పటికీ ఆఫర్లు రావడం లేదని ఇటీవల ఓ తెలుగు నటి వెల్లడించారు. అయితే తాజాగా కాస్టింగ్ కౌచ్ గురించి బాలీవుడ్ హీరోయిన్ అభా రత్న తనకు జరిగిన సంఘటనల గూర్చి తెలిపింది.

డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘హీరామండి’ సిరీస్‌లో మనీషా కొయిరాలా యుక్తవయసు అమ్మాయి పాత్రలో అభా రత్నా కీలక పాత్రలో నటించింది. అభా రత్నా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి చెప్పుకొచ్చింది.


కెరీర్ తొలినాళ్లలో కొందరు పరోక్షంగా కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడేవారు. కొందరు ఫోన్ చేసి మీటింగ్ ఉంది రమ్మని చెప్పి అది అడిషన్ కాదని ముందే చెప్పేవారని తెలిపింది. అప్పట్లో ఆ ఫోన్ కాల్స్ గురించి అంతగా అర్థమయ్యేది కాదు. ఫోన్ చేసి మీటింగ్ రమ్మంటారు.. కానీ అడిషన్ కాదంటున్నారేంటీ అంటూ సందిగ్దంలో పడిపోయేదాన్ని. ఎందుకో అక్కడికి వెళ్లే ధైర్యం కూడా రాలేదు. కానీ ఎప్పుడు తనను నేరుగా ఎవరు సంప్రదించలేదని.. నేరుగా అలాంటి పరిస్థితులు ఎదురుకాలేదని తెలిపింది. కాస్టింగ్ కౌచ్ గురించి అభా రత్నా చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
Next Story