జాతీయ రహదారిపై ఎదురెదురుగా ఢీకొన్న వ్యాన్ ట్రక్కు.. ఒకరు మృతి

by Mahesh |
జాతీయ రహదారిపై ఎదురెదురుగా ఢీకొన్న వ్యాన్ ట్రక్కు.. ఒకరు మృతి
X

దిశ, కొడిమ్యాల: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు గ్రామంలో జాతీయ రహదారిపై గల బ్రిడ్జి మీద ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల వైపు నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న ట్రక్కు కరీంనగర్ నుండి జగిత్యాల వైపు వస్తున్న పాల వ్యాను ఎదురెదురుగా ఢీకొనడంతో ఒకరు మృతి చెందినట్లు వారు తెలిపారు. ప్రమాదంలో రెండు వాహనాలు క్యాబిన్ భాగం పూర్తిగా నుజ్జు నుజ్జు కావడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ మళ్లించి ప్రమాదానికి గురైన వాహనాలను క్రెన్‌ల సహాయంతో తొలగించారు.

Next Story