- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
by Shamantha N |
<p>శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఆదివారం ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్టు అధికారులు వెల్లడించారు. దక్షిణ కశ్మీర్ జిల్లా షోపియాలోని రేబాన్ ఏరియాలో ఉగ్రవాదులు తలదాచుకున్నట్టు అధికారులకు సమాచారం అందింది. దీంతో ఆ ఏరియాలో బలగాలు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలోనే బలగాలపైకి ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఎన్‌కౌంటర్ బద్దలైనట్టు ఓ పోలీసు అధికారి తెలిపారు. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారని వివరించారు. […]</p>

X
శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఆదివారం ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్టు అధికారులు వెల్లడించారు. దక్షిణ కశ్మీర్ జిల్లా షోపియాలోని రేబాన్ ఏరియాలో ఉగ్రవాదులు తలదాచుకున్నట్టు అధికారులకు సమాచారం అందింది. దీంతో ఆ ఏరియాలో బలగాలు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలోనే బలగాలపైకి ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఎన్‌కౌంటర్ బద్దలైనట్టు ఓ పోలీసు అధికారి తెలిపారు. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారని వివరించారు. అయితే, వీరు ఏ ఉగ్రవాద సంస్థకు చెందినవారో ఇంకా గుర్తించాల్సి ఉన్నదని పేర్కొన్నారు. ఈ ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతున్నట్టు ఆదివారం మధ్యాహ్నాం ఆ అధికారి తెలిపారు.
Next Story






