లిఫ్ట్ ఆమె చావుకొచ్చింది..

by  |
లిఫ్ట్ ఆమె చావుకొచ్చింది..
X

దిశ, వెబ్‌డెస్క్: కారు లిఫ్ట్ అడిగి మరీ చావు కొనితెచ్చుకుంది ఓ మహిళ. ఆమె లిఫ్ట్ అడిగి వెళ్లిన కారు ఎస్ఆర్ఎస్పీ కెనాల్‌లోకి ఒక్కసారిగా దూసుకెళ్లింది. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. పర్వతగిరి మండలం కొంకపాక వద్ద బుధవారం ఉదయం ఎస్ఆర్ఎస్పీ కాలువలోకి అదుపు తప్పి ఓ కారు దూసుకెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారు. ఈ నీటి ప్రవాహాంలో ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. కారు డ్రైవర్‌ను గమనించిన స్థానికులు ఆయన్ను కాపాడారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు చేపట్టగా ఇద్దరు మృతదేహాలు లభ్యమయ్యాయి. కాగా, గల్లంతైన మరొకరి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. మృతుల్లో ఒకరు వరంగల్ వినాయక ట్రేడర్ ఓనర్ శ్రీధర్‌గా గుర్తించారు. మరొకరు గూంటూర్‌పల్లిలో గవర్నమెంట్ స్కూల్‌లో టీచర్‌గా విధులు నిర్వహిస్తున్న రేణుకగా గుర్తించారు. అయితే రేణుక లిఫ్ట్ అడిగి కారులో ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు.



Next Story

Most Viewed