ముగ్గురు పవన్ కల్యాణ్ అభిమానులు మృతి

by Vadlamudi Anukaran |   (  Updated:2020-09-01 11:07:58  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రేపు పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీలు కడుతున్న అభిమానులు కరెంట్‌ షాక్‌కు గురై అక్కడికక్కడే ముగ్గురు దుర్మరణం చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడగా వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించారు. గాయపడిన నలుగురిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం చెన్నైకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. మృతుల్లో అన్నదమ్ములు ఉన్నారు. కుప్పం- పలమనేరు జాతీయ రహదారిపై శాంతిపురం ఏడో [&hellip;]</p>

ముగ్గురు పవన్ కల్యాణ్ అభిమానులు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రేపు పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీలు కడుతున్న అభిమానులు కరెంట్‌ షాక్‌కు గురై అక్కడికక్కడే ముగ్గురు దుర్మరణం చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడగా వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించారు. గాయపడిన నలుగురిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం చెన్నైకి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. మృతుల్లో అన్నదమ్ములు ఉన్నారు. కుప్పం- పలమనేరు జాతీయ రహదారిపై శాంతిపురం ఏడో మైలు వద్ద ప్రమాదం చోటు చేసుకుంది.

Next Story