- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎస్సారెస్పీ కాలువలోకి దూసుకెళ్లిన కారు..
<p>దిశ, వెబ్‌డెస్క్ : జగిత్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అదుపుతప్పి కారు ఎస్సారెస్పీ కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులోని ముగ్గురు ప్రయాణికులు గల్లంతవ్వగా, ఒక్కరు సురక్షితంగా బయటపడ్డారు.ఈ ఘటన జిల్లాలోని మేడిపల్లి సమీపంలో సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. జోగినిపల్లి దైవదర్శనం కోసం వెళ్తుండగా ప్రమాదం సంభవించినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పాట్‌కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కెనాల్ నుంచి కారును బయటకు తీయగా.. భార్య, కుమార్తె సహా అడ్వకేట్ అమరేందర్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : జగిత్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అదుపుతప్పి కారు ఎస్సారెస్పీ కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులోని ముగ్గురు ప్రయాణికులు గల్లంతవ్వగా, ఒక్కరు సురక్షితంగా బయటపడ్డారు.ఈ ఘటన జిల్లాలోని మేడిపల్లి సమీపంలో సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. జోగినిపల్లి దైవదర్శనం కోసం వెళ్తుండగా ప్రమాదం సంభవించినట్లు సమాచారం.
విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పాట్‌కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కెనాల్ నుంచి కారును బయటకు తీయగా.. భార్య, కుమార్తె సహా అడ్వకేట్ అమరేందర్ రావు మృతి చెందారు. కొడుకు జయంత్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించారు. కారు ప్రమాదంలో కుటుంబాన్ని పొగొట్టుకున్న జయంత్‌ను బంధువులకు అప్పజెప్పనున్నట్లు తెలుస్తోంది.
Next Story






