- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాల్వలోకి దూసుకెళ్లిన కారు..ముగ్గురు మృతి
<p>దిశ, వెబ్ డెస్క్ : అదుపు తప్పి కారుకాల్వలోకి దూసుకెళ్లిన ఘటన తూర్పగోదావరి జిల్లా, ఆత్రేయపురం మండలం లొల్లలాకుల వద్ద చోటు చేసుకుంది. ఈ కారులో ఐదుగురు ప్రయాణిస్తున్నారు. అందులో ఇద్దరు సురక్షితంగా బయట పడగా ముగ్గురు మృతి చెందారు. వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గొల్లలకోడేరుకు చెందిన వారు శివరాత్రి సందర్భంగా వారి బంధువుల ఇంటికి వెళ్లారు. తిరిగి తెల్లవారుజామున వెళ్తుంటే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వీరిలో వెంకటగణపతి రాజు, […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : అదుపు తప్పి కారుకాల్వలోకి దూసుకెళ్లిన ఘటన తూర్పగోదావరి జిల్లా, ఆత్రేయపురం మండలం లొల్లలాకుల వద్ద చోటు చేసుకుంది. ఈ కారులో ఐదుగురు ప్రయాణిస్తున్నారు. అందులో ఇద్దరు సురక్షితంగా బయట పడగా ముగ్గురు మృతి చెందారు.
వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గొల్లలకోడేరుకు చెందిన వారు శివరాత్రి సందర్భంగా వారి బంధువుల ఇంటికి వెళ్లారు. తిరిగి తెల్లవారుజామున వెళ్తుంటే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వీరిలో వెంకటగణపతి రాజు, సీతారామరాజు సురక్షితంగా బయటపడ్డారు. సురేష్ వర్మ, శ్రీనివాస్, లభ్యం కాగా వెంకటసత్యనారాయణ చనిపోయారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






