జైళ్లో కాల్పులు.. ముగ్గురు గ్యాంగ్ స్టర్‌లు హతం

by  |
Chitrakoot jail
X

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని ఓ జైలులో కాల్పులు కలకలం రేపాయి. రాష్ట్రంలోని చిత్రకూట్ జైలులో ఖైదీల మధ్య శుక్రవారం ఘర్షణ చెలరేగింది. ఘర్షణ అంతకంతకు పెరిగి కాల్పులకు దారి తీసింది. ఈ ఘటనలో మొత్తం ముగ్గురు ఖైదీలు మరణించారు. కాగా ఖైదీలను యూపీకి చెందిన గ్యాంగ్ స్టర్‌లు ముకిమ్ కాలా, మిరాజుద్దీన్‌, అన్షుల్ దీక్షిత్‌లు‌గా గుర్తించారు. జైలు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… శుక్రవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఖైదీల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో అన్షుల్ దీక్షిత్ అనే ఖైదీ ముకిమ్ కాలా, మిరాజుద్దీన్‌లపై కాల్పులు జరిపాడు.

దీంతో వారిద్దరూ అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. లొంగిపోవాలని అన్షుల్ దీక్షిత్‌ను పోలీసులు కోరగా అతను కాల్పులు కొనసాగించాడు. పోలీసులు కూడా కాల్పులు జరిపారు. దీంతో అన్షుల్ దీక్షిత్ మరణించాడు. ఘటనపై సమాచారం అందుకున్న జైలు డిప్యూటీ ఇన్స్‌పెక్ట‌ర్‌ జనరల్ ఇంఛార్జీ పీఎన్ పాండే, చిత్రకూట్ ఎస్‌పీ అంకిత్ మిట్టల్ జైలుకు చేరకున్నారు. జైలులోకి తుపాకీ ఎలా వచ్చిందనే విషయంపై దర్యాప్తు చేస్తామని ఆయన పేర్కొన్నారు. కాగా ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు.


Next Story