- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రంలో మూడు రోజులు భారీ వర్షాలు
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో : పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టం నుంచి 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో దక్షిణం వైపు ఉందని, దీని ప్రభావం వల్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపారు. ఆదిలాబాద్, కొమరంభీం ఆసీఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్ […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టం నుంచి 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో దక్షిణం వైపు ఉందని, దీని ప్రభావం వల్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపారు.
ఆదిలాబాద్, కొమరంభీం ఆసీఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్ అర్బన్, నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం, సూర్యాపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి, మహబూబ్ నగర్. నారాయణపేట జిల్లాలకు వర్ష సూచన ఉందని పేర్కొన్నారు. శుక్రవారం అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూరుగంపాడులో 73.4మిమీ వర్షాపాతం నమోదైంది.
Next Story






