హైదరాబాద్‌లో ముగ్గురు చైన్‌స్నాచర్లు అరెస్టు

by  |
హైదరాబాద్‌లో ముగ్గురు చైన్‌స్నాచర్లు అరెస్టు
X

దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: నార్సింగి, రాయదుర్గం పోలీస్‌స్టేషన్ల పరిధిలో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న టోలీచౌకీ ప్రాంతానికి చెందిన అఫ్రోజ్, మహ్మద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అఫ్రోజ్‌పై 16 కేసులు, మహ్మద్ ఇమ్రాన్ పై 3కేసులు గతంలో నమోదయ్యాయి. వీరిద్దరూ జైలు నుంచి విడుదలై 5నెలలు అవుతోంది. తర్వాత కూడా మళ్లీ దొంగతనాలకు పాల్పడుతున్నారు. మరో కేసులో గుంటూరు జిల్లాకు చెందిన ప్రభు, కృష్ణలు ఫిల్మ్‌నగర్‌లో నివసిస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. వీరిలో ప్రభు పరారీలో ఉండగా, కృష్ణను పోలీసులు అరెస్టు చేశారు. అఫ్రోజ్, ఇమ్రాన్‌ల నుంచి మూడున్నర తులాల బంగారంతో పాటు బైక్, కృష్ణ నుంచి నాలుగు తులాల బంగారు చైన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు.

Next Story

Most Viewed