కాంగ్రెస్ పార్టీ ఆలేరు ఇన్‌చార్జికి బెదిరింపు కాల్.. రూ.5 కోట్లు ఇవ్వకపోతే..

by  |
Beerla Ilaiah
X

దిశ, భువనగిరి రూరల్ : కాంగ్రెస్ పార్టీ ఆలేరు ఇన్‌చార్జి బీర్ల ఐలయ్యను గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. బుధవారం రాత్రి గుర్తు తెలియని నంబర్ నుంచి కాల్ చేసి తనకు రూ.5కోట్లు ఇవ్వాలని ఓ వ్యక్తి డిమాండ్ చేశారు. నువ్వు కాబోయే ఎమ్మెల్యేవని, నాతో నీకు అవసరం ఉంటుందని అజ్ఞాత వ్యక్తి మాట్లాడాడు. నువ్వు నన్ను ఏమీ చేయలేవని, పోలీసులకు చెప్పినా.. వాళ్లు మళ్లీ నాకే చెబుతారని గుర్తు తెలియని వ్యక్తి పేర్కొన్నాడు. నీకు ఏ సహాయం కావాలన్నా చేస్తా.. నీకు నా అవసరం చాలా ఉంటుంది.. భవిష్యత్తు ఉన్న నాయకుడివి.. నేను అడిగిన రూ.5 కోట్లు ఇవ్వు అని కోరాడు. వీరిద్దరి మధ్య 9 నిమిషాలకు పైగా సంభాషణ జరిగింది. కాగా, వీరి మధ్య రెండు రోజులుగా ఫోన్ కాల్స్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వారి ఆడియో రికార్టు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

బీర్ల ఐలయ్య, అజ్ఞాత వ్యక్తి మధ్య జరిగిన సంభాషణ కోసం కింది లింక్‌ను క్లిక్ చేయండి

WhatsApp Audio 2021-07-07 at 11.45.44 PM


Next Story

Most Viewed