మోడీ చట్టాలతో ఆహార భద్రతకు ముప్పు..

by  |
MLC-Narsi-Reddy
X

దిశ, నల్లగొండ : కేంద్రంలోని మోడీ సర్కార్ తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలతో దేశ ప్రజల ఆహార భద్రతకు ముప్పు ఏర్పడుతుందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ నియోజకవర్గ కేంద్రమైన నల్లగొండ నుంచి హైదరాబాద్‌లోని సీఎం కార్యాలయం ప్రగతి భవన్ వరకూ సమస్యలు పరిష్కరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ బుధవారం ఉదయం నర్సిరెడ్డి నడకయాత్రను ప్రారంభించారు.

ఈ సందర్భంగా గడియారం చౌరస్తాలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఉపాధ్యాయ పదోన్నతుల షెడ్యూల్‌ను ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని, అన్ని రకాల ప్రభుత్వ విద్యాసంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయులు, లెక్చరర్ల బదిలీ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పనిచేసే కాంట్రాక్ట్ లెక్చరర్లకు 7వ పీఆర్సీ ప్రకారం వేతనాలను పెంచాలని కోరారు. నూతన విద్యావిధానం ప్రకారం పూర్వ ప్రాథమిక విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయుటకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నడకయాత్ర 17వ తేదీ సాయంత్రం 6 గంటలకు ప్రగతి భవన్ వద్ద ముగుస్తుందని ఆయన తెలిపారు.


Next Story

Most Viewed