నోరుజారితే మూడింటికి ముప్పు?

211

మీకు కోపం వస్తే
రెచ్చిపోయి పళ్ళుపటపట
కొరకుతూ పిచ్చిపిచ్చిగా
మాట్లాడేది – మీ నోరు
రాలేది – మీ పళ్ళు
తెగేది – మీ నాలుక
పగిలేది – మీ తల
కారేది – మీ రక్తం
విరిగేది- మీ కాళ్ళు చేతులు
నలిగేది – మీ మనసు
నలుగురిలోపోయేది – మీ పరువు
నవ్వులపాలయ్యేది – మీరు
అందుకే మీ మాట జాగ్రత్త
పౌరుషంగా నోటమాట జారిందా
ఇక రక్తం ఏరులై పారిందే….
ఆ మూడింటికిక మూడిందే
మీ కంటికి – మీ పంటికి – మీ ఒంటికి.కాస్త జాగ్రత్త సుమీ!

రచన.పోలయ్య కవి కూకట్లపల్లి
హైదరాబాద్. – 9110784502

Email. [email protected]
Address.Attapur. Hyderabad.48