ఏపీలో 53వేల మంది టీచర్లకు పొంచి ఉన్న ముప్పు..

by Vemula.Srinu Prasad |   (  Updated:2021-07-05 05:12:03  IST  )

<p>దిశ, ఏపీ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యా విధానం అమలుపై శాసన మండలి సభ్యుడు విఠపు బాలసుబ్రహ్మణ్యం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విద్యావిధానం వల్ల రాష్ట్రంలో 53వేల ఉపాధ్యాయ పోస్టులు రద్దయ్యే ప్రమాదం పొంచి ఉందని ఆరోపించారు. ఒంగోలులో యూటీఎఫ్‌ జిల్లా సీపీఎస్‌ సబ్‌ కమిటీ విస్తృతస్థాయి ఆన్‌లైన్‌ సమావేశంలో పాల్గొన్న ఆయన నూతన విద్యావిధానం వల్ల 3,4,5 తరగతులు చదివే పిల్లలు 3 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉండే [&hellip;]</p>

ap news
X

దిశ, ఏపీ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యా విధానం అమలుపై శాసన మండలి సభ్యుడు విఠపు బాలసుబ్రహ్మణ్యం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విద్యావిధానం వల్ల రాష్ట్రంలో 53వేల ఉపాధ్యాయ పోస్టులు రద్దయ్యే ప్రమాదం పొంచి ఉందని ఆరోపించారు. ఒంగోలులో యూటీఎఫ్‌ జిల్లా సీపీఎస్‌ సబ్‌ కమిటీ విస్తృతస్థాయి ఆన్‌లైన్‌ సమావేశంలో పాల్గొన్న ఆయన నూతన విద్యావిధానం వల్ల 3,4,5 తరగతులు చదివే పిల్లలు 3 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉండే హైస్కూళ్లకు వెళ్లాల్సి వస్తుందన్నారు. ఫలితంగా డ్రాప్‌ అవుట్‌లు పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

విద్యాహక్కు చట్టం ప్రకారం విద్యార్థులను దూరంగా ఉన్న పాఠశాలలకు పంపడం సరికాదని ఎమ్మెల్సీ ఆవేదన వ్యక్తం చేశారు. 1,2 తరగతులను అంగన్‌వాడీల్లో విలీనం చేస్తే వాటి నిర్వహణ బాధ్యత శిశుసంక్షేమశాఖదా లేదా విద్యాశాఖదా అన్న విషయంలో క్లారిటీ లేదని చెప్పుకొచ్చారు. కేంద్రప్రభుత్వ నిర్ణయాల వల్ల విద్యార్థులు చదువుకు దూరమయ్యే అవకాశం ఉందని ఎమ్మెల్సీ బాలసుబ్రమణ్యం స్పష్టం చేశారు.

Next Story