- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శవాలైన ఆ ముగ్గురు బాలికలు
<p>దిశ, వెబ్‌డెస్క్: అదృశ్యమైన ముగ్గురు బాలికల కుటుంబాల్లో తీరని విషాదం నెలకొన్నది. ఇంటి నుంచి వెళ్లిన బాలికలు చెరువులో అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన ఒడిశా రాష్ట్రంలోని కొరాపుట్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. డియోగంజ్ గ్రామానికి చెందిన ముగ్గురు బాలుకలు సోమవారం ఇంటి నుంచి బయటకు వెళ్లారు. సాయంత్రం అయినా తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు గ్రామంలో, స్నేహితుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో అదే రోజు రాత్రి […]</p>

దిశ, వెబ్‌డెస్క్: అదృశ్యమైన ముగ్గురు బాలికల కుటుంబాల్లో తీరని విషాదం నెలకొన్నది. ఇంటి నుంచి వెళ్లిన బాలికలు చెరువులో అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన ఒడిశా రాష్ట్రంలోని కొరాపుట్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
డియోగంజ్ గ్రామానికి చెందిన ముగ్గురు బాలుకలు సోమవారం ఇంటి నుంచి బయటకు వెళ్లారు. సాయంత్రం అయినా తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు గ్రామంలో, స్నేహితుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో అదే రోజు రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మంగళవారం ఉదయం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు డియోగంజ్ గ్రామంలోని చెరువులో ముగ్గురు బాలికలు శవాలై కనిపించారు. వెంటనే మృతదేహాలను బయటకు తీసిన పోలీసులు అనుమానస్పద కేసు నమోదు చేశారు. గ్రామస్థుల సైతం బాలికల మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మాత్రం ముగురు బాలికలు చెరువులో స్నానానికి వెళ్లి లోతు తెలియక మృతి చెంది ఉంటారని అనుమానిస్తున్నారు. కాగా ఒకే గ్రామంలో ముగ్గురు బాలికలు మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొన్నది.






