అరుదైన కళారూపాలను డాక్యుమెంట్ చేస్తున్న లెక్చరర్!

by  |
lecturer rare art forms
X

దిశ, ఫీచర్స్ : జానపద కళా సాహిత్యము ద్వారా జాతి సంస్కృతి తెలుస్తుందని అంటుంటారు. ఆ మాటల్లో నిజం లేకపోలేదు. శతాబ్దాలుగా ప్రజలకు వినోదాన్ని విజ్ఞానాన్ని అందించిన వాటిలో కళారూపాలు, హస్తకళలు తప్పక ఉంటాయి. అయితే కాలక్రమంలో ఎన్నో ఆర్ట్ ఫార్మ్స్, క్రాఫ్ట్స్ కనుమరుగైపోయాయి. సంస్కృతీ వారసత్వాన్ని కాపాడుకోవడం మన బాధ్యత కాగా, ఒడిశా, నువాపాడా జిల్లాకు చెందిన జత్ కుమార్ పాణిగ్రాహి అనే లెక్చరర్ దాదాపు దశాబ్ద కాలంగా ఆ పనిలోనే ఉన్నాడు. ఒడిశాలోని మారుమూల గ్రామాలకు పరిమితమైన నాటి కళారూపాలు, హస్తకళలను తెలుసుకునేందుకు ప్రయాణిస్తున్నాడు. వాటిని ప్రపంచానికి తెలియజేసేందుకు తన యూట్యూబ్ చానల్ ‘మతిర్ కాలా’లో డాక్యుమెంట్ చేస్తున్నాడు.

జత్ కుమార్ ఈ తొమ్మిదేళ్ల కాలంలో ఒడిషాలోని దాదాపు 1,000 గ్రామాలకు వెళ్లాడు. ఈ ప్రయాణంలోనే అనేక చేతిపనులు, సాంప్రదాయ కళాకారులను కలుసుకోగా, వారి పని విధానాన్ని డాక్యుమెంట్ చేశాడు. 28 ఏళ్ల రజత్ 2012లో కళాశాలలో ఉన్నప్పుడు సంప్రదాయ సంగీత వాయిద్యాలతో తన డాక్యుమెంటేషన్ డ్రైవ్‌ను ప్రారంభించాడు. అతను వారాంతాల్లో వాయిద్యాల కోసం వెతుకుతూ నూవాడలోని గ్రామాలను సందర్శించి, చాలా వాటిని కనుగొన్నాడు. అయితే ఆ సాధనాలు సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలలో ఉపయోగించారు కానీ వాటి వల్ల తమ జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో వాటిని వినియోగించిన కళాకారులు మాత్రం వృత్తిని వదులుకున్నారు. సంగీత పరికరాల కోసం కొనుగోలుదారులను వెతకడం ద్వారా రజత్ వారికి సహాయం చేయడానికి ప్రయత్నించాడు.

ఈ క్రమంలోనే రజత్‌ అరుదైన కళారూపాలు, కళాఖండాలను కనుగొనడానికి కలహండి, బాలంగీర్, సోనేపూర్‌లను అన్వేషించాలని నిర్ణయించుకున్నాడు. రెండేళ్ల తరువాత, అతను జువాలజీలో లెక్చరర్‌గా కళాశాలలో చేరాడు కానీ తన ప్రయత్నాన్ని కొనసాగించాడు. సంవత్సరాలుగా, అతను వివిధ ప్రదర్శనా కళారూపాలను చూడటంతో పాటు కలహండి నుంచి పాత చెక్క శిల్పాలు, నువాపాడా నుండి వెదురు చేతిపనులు, సంప్రదాయ వాయిద్యాలు, హస్తకళలు , టెర్రకోట పీసెస్‌ను ఈ ప్రాంతంలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించాడు.

తన ఫలితాలను డాక్యుమెంట్ చేయాల్సిన అవసరం ఉందని భావించిన రజత్, 2017లో నేమ్‌సేక్ యూట్యూబ్ చానెల్‌తో పాటు ‘మతిర్ కాలా’ ప్రారంభించాడు. డాక్యుమెంటేషన్ డ్రైవ్‌లో అతడి కజిన్ సత్య పాణిగ్రాహి, స్నేహితుడు గణేష్ ప్రధాన్ వీడియోలను రికార్డ్ చేయడానికి, ఎడిట్ చేయడంలో సహాయపడతాడు. అతను కళా రూపాలు, హస్తకళలపై వీడియోలను రూపొందించడమే కాకుండా కళాకారులను ఇంటర్వ్యూ చేశాడు.

నువాపాడాలోని చుక్తియా బుంజియా తెగకు చెందిన జానపద సంస్కృతి, బాలంగీర్ దేబ్‌గురు జానపద సంప్రదాయం, నువాపాడా, సోనేపూర్, బాలంగీర్ జానపద పరికరాల తయారీదారులు, బార్గఢ్ – దాల్ఖాయ్ జానపద సంప్రదాయం, కలహండిలో డోంగ్రియా కంధ జానపద సంప్రదాయాలు, ధుంకెల్ వాయిద్యం, సంబల్‌పూర్‌లో కిసాన్ జానపద నృత్యం, బలంగిర్‌లో సారంగి, గుడ్కా జానపద వాయిద్యాలు, కహలాండీ ఘుమ్రా నృత్యం, నౌపాడాలోని బిజయ్‌ఘర్ (రాజ్ కొమ్నా) ఛతర్ జాతర, బార్గఢ్ ఇకత్, నువాపాడా తోలుబొమ్మల నృత్యం వంటి కళలన్నీ అతడి డాక్యుమెంటేషన్‌లో ఉన్నాయి.

రజత్ యూట్యూబ్ వీడియోలను విద్యార్థులు పరిశోధన కోసం ఉపయోగిస్తున్నారు. అతను త్వరలో కళ, సంస్కృతికి సంబంధించిన వివిధ అంశాలపై లెక్చర్ సిరీస్(ఉపన్యాస శ్రేణి)ని ప్రారంభించాలని యోచిస్తున్నాడు. అంతేకాకుండా, సాంప్రదాయ సంగీత వాయిద్యాలను ప్రదర్శించడానికి అతను తన ఇంటి వద్ద ఒక మ్యూజియాన్ని అభివృద్ధి చేస్తున్నాడు, వీటిలో చాలా వరకు అరుదైన పరికరాలుంటాయని తెలిపాడు.


Next Story

Most Viewed