- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ట్యూబ్‌లైట్ టు సెలబ్రిటీ మేనేజర్.. డిస్‌లెక్సియా కుర్రాడి ఇన్‌స్పిరేషనల్ స్టోరీ!
<p>దిశ, ఫీచర్స్ : డిస్‌లెక్సియా అనేది ఓ లెర్నింగ్ సమస్య కాగా ఈ సమస్య ఉన్నవారు నేర్చుకోవడంలో, రాయడంలో ఇబ్బందిపడుతుంటారు. కానీ వారి తెలివితేటలు, సృజనాత్మకత స్థాయి అందరికంటే ఎక్కువగానే ఉంటుంది. భారత్‌లో 3.5కోట్ల మంది డిస్‌లెక్సియా బాధపడుతున్నట్లు అంచనా. అయితే ముంబైలో నివసించే హర్ష్ దోషి కూడా డిస్‌లెక్సియాతో బాధపడిన వ్యక్తే కాగా.. ప్రస్తుతం టెడ్ఎక్స్ స్పీకర్‌గా, సెలబ్రిటీ మేనేజర్‌గా ఎదిగిన దోషి.. ప్రస్తుతం ఎంతోమందికి స్ఫూర్తిప్రదాతగా మారాడు. అక్టోబర్ 7న ప్రపంచ డిస్‌లెక్సియా అవగాహన […]</p>

దిశ, ఫీచర్స్ : డిస్‌లెక్సియా అనేది ఓ లెర్నింగ్ సమస్య కాగా ఈ సమస్య ఉన్నవారు నేర్చుకోవడంలో, రాయడంలో ఇబ్బందిపడుతుంటారు. కానీ వారి తెలివితేటలు, సృజనాత్మకత స్థాయి అందరికంటే ఎక్కువగానే ఉంటుంది. భారత్‌లో 3.5కోట్ల మంది డిస్‌లెక్సియా బాధపడుతున్నట్లు అంచనా. అయితే ముంబైలో నివసించే హర్ష్ దోషి కూడా డిస్‌లెక్సియాతో బాధపడిన వ్యక్తే కాగా.. ప్రస్తుతం టెడ్ఎక్స్ స్పీకర్‌గా, సెలబ్రిటీ మేనేజర్‌గా ఎదిగిన దోషి.. ప్రస్తుతం ఎంతోమందికి స్ఫూర్తిప్రదాతగా మారాడు. అక్టోబర్ 7న ప్రపంచ డిస్‌లెక్సియా అవగాహన దినోత్సవంలో భాగంగా హ్యూమన్స్ ఆఫ్ బాంబే అతడి స్టోరీ షేర్ చేయగా, ప్రస్తుతం అది వైరల్ అయింది.
2 నెలల వయసులో హర్ష్ దోషిని బాంబేకు చెందిన దంపతులు దత్తత తీసుకున్నారు. అయితే 4 ఏళ్ల వయసులో కూడా అక్షరాలను ఉచ్చరించడానికి కష్టపడ్డాడు. ఒక్కమాట చెప్పడానికి వందసార్లు ఆ పదాన్ని వినేవాడు. మాటలు తడబడేవి. అతడితో స్నేహం చేయడానికి ఎవరూ ఇష్టపడలేదు. కొందరు హర్ష్‌ను ‘ట్యూబ్‌లైట్’అని పిలిచేవారు. పాఠ్యపుస్తకాలు చదవలేకపోవడం, షూలేస్‌లను కూడా కట్టలేకపోవడం, తోటిపిల్లల ఎగతాళి వంటి అంశాలతో ప్రపంచంలోనే తెలివితక్కువ అబ్బాయిలా భావించాడు. పెద్దయ్యాక అతడి పరిస్థితి మరింత అధ్వానంగా మారగా, 3వ తరగతిలో ఉన్నప్పుడు అతడి టీచర్లు హర్ష్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి ‘మీ అబ్బాయి ఈ విద్యా సంవత్సరం దాటలేడు.’ అని కరాఖండిగా చెప్పేశారు. దీంతో తల్లిదండ్రులు హర్ష్‌ను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లగా డిస్‌లెక్సియా ఉన్నట్లు నిర్ధారణ అయింది. అయినప్పటికీ ‘మీ అబ్బాయికి పిచ్చి ఉంది. అతన్ని ప్రత్యేక పాఠశాలకు తీసుకెళ్లండి’ అంటూ టీచర్స్ చెప్పారు. ఇలాంటి కష్టసమయంలో అతడి తల్లిదండ్రులు అండగా ఉండి ఓర్పుతో అన్ని నేర్పించారు. ఈ క్రమంలోనే తారే జమీన్ పర్ సినిమా అతడి జీవితాన్ని మలుపు తిప్పింది! ‘ప్రపంచం నా కోసం మారదు. కానీ నేను నన్ను మార్చుకోగలను’ అని హర్ష్ గ్రహించాడు. నెమ్మదిగా చదవడం, రాయడం పట్ల ఆసక్తి చూపడం ప్రారంభించి, వివిధ అంశాలను నేర్చుకోవడానికి సొంత పద్ధతులను అవలంభించాడు. ఈ మేరకు 9వ తరగతిలో ఫెయిలైనా, ఇంటర్‌లో మంచి మార్కులు తెచ్చుకుని అభినందనలు అందుకున్నాడు.
‘సినిమాలను బాగా ఇష్టపడతాను. దీంతో పాఠశాల తర్వాత మీడియా కోర్సులో చేరాను. అక్కడ ఓ ఫెస్ట్‌లో భాగంగా 15నిమిషాల పాటు ఆడియెన్స్‌ను అలరించాను. అది విశ్వాసాన్ని పెంచింది. క్లాస్‌రూమ్ చర్చల్లో మాట్లాడటం మొదలుపెట్టి, ఫైనల్‌గా స్టేజ్‌పై స్పీచ్‌లు ఇచ్చే స్థాయికి ఎదిగాను. అందుకోసం అద్దం ముందు మాట్లాడటం సాధన చేసేవాడిని. అంతేకాదు మీడియా కోర్సులో డిస్టింక్షన్‌తో పట్టభద్రుడయ్యాను! గతేడాది టెడ్ టాక్‌లో మాట్లాడితే, అమ్మ నాన్నలు కంటతడి పెట్టారు. కానీ నా ప్రసంగం విని ఓ పిల్లవాడు నా దగ్గరకు వచ్చి, ‘నువ్వు చాలా బాగా వివరించావు. దయచేసి నాకు బోధకుడిగా ఉండండి! ’ అన్నప్పుడు ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోయాను. నా కెరీర్ మేనేజర్‌గా ప్రారంభమైంది. ఒకప్పుడు మాటలతో సంబంధం లేని పిల్లవాడు ఇప్పుడు ఇతరులకు వారి పబ్లిక్ ప్రజెన్స్ మెరుగుపరచడంలో సహాయం చేస్తున్నాడు. నాకు డిస్‌లెక్సియా ఉండవచ్చు, కానీ డైస్‌లెక్సియా లేదు’
– హర్ష్






