డబుల్ డెక్కర్ లగ్జరీ క్యాంపర్ వ్యాన్

by  |
డబుల్ డెక్కర్ లగ్జరీ క్యాంపర్ వ్యాన్
X

దిశ, ఫీచర్స్ : సాధారణంగా క్యాంపర్ వ్యాన్ ఫ్యామిలీ జర్నీకి చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. వాష్‌రూమ్, బెడ్ రూమ్ వంటి ఇతరత్రా సౌకర్యాలతో ఇందులోనే నివాసం ఉండేలా అనువైన ఏర్పాట్లను కూడా చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే, ఇప్పటివరకు మనం డబుల్ డెక్కర్ బస్సులు, రైళ్లను మాత్రమే చూసుంటాం. కానీ ఇప్పుడు క్యాంపర్ వ్యాన్ కూడా డబుల్ డెక్కర్‌ డిజైన్‌తో మార్కెట్‌లో రిలీజ్ కాగా, ఇందులో ఎలివేటర్ కూడా ఉండటం విశేషం.

కొవిడ్ నేర్పిన పాఠాలతో అందరి లైఫ్ స్టైల్‌లోనూ చాలా మార్పొచ్చింది. ఈ క్రమంలోనే పలు మ్యానుఫ్యాక్చరింగ్, ఫుడ్ కంపెనీలు వినియోగదారులకు అనుకూలంగా ఉండే ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘మాక్సస్ వి90 లైఫ్ హోమ్ విల్లా ఎడిషన్’ డబుల్ డెక్కర్‌ డిజైన్‌తో మార్కెట్‌లో అడుగుపెట్టింది. కేవలం ఒకే బటన్‌తో ఈ డబుల్ డెక్కర్ క్యాంపర్ వ్యాన్‌ను ఫ్లోర్స్ లివింగ్ స్పేస్‌గా మార్చుకోవచ్చు. క్యాంపర్‌లో స్టాండర్డ్ కిచెన్, ఎంటర్‌టైన్మెంట్, స్లీపింగ్ ఏరియాతో పాటు బార్, జెన్ టీ గది లేదా యోగా గదులున్నాయి.

రెండో అంతస్తు పూర్తిగా గాజుతో నిర్మించగా, జర్నీలో విశ్రాంతి తీసుకోవడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. డ్రైవర్ క్యాబిన్ మీదుగా వాక్-అవుట్ బాల్కనీ కూడా ఉండటం ఈ క్యాంపర్ ప్రత్యేకత. రెండో అంతస్తు, 133 చదరపు అడుగుల్లో విస్తరించి ఉండగా, కింద ఉండే లివింగ్ రూమ్ 215 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. బాత్రూమ్, షవర్.. వెనుక భాగంలో ఉన్నాయి. ఎల్‌ఈడీ లైటింగ్, సౌండ్ సిస్టమ్, టీవీ లేదా ప్రొజెక్టర్ కోసం హుక్అప్‌లు, వాషింగ్ మెషిన్ ఎయిర్ కండిషనింగ్ అవసరం మేరకు తగిన ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం చైనాలో మాత్రమే ఈ విల్లా ఎడిషన్ క్యాంపర్ వ్యాన్స్ అందుబాటులో ఉండగా, దీని ధర 2.68 మిలియన్ యువాన్లు.


Next Story

Most Viewed