- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉల్లి చోరీ…నాట్ ఏ సిల్లీ స్టోరీ….
<p>దిశ, వెబ్ డెస్క్: ఉల్లిని… ఒకప్పుడు కోస్తే కన్నీరు వచ్చేది, ఇప్పుడు కొంటే కన్నీరు వస్తోంది. ప్రస్తుతం ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటడంతో దాన్ని కొనాలంటేనే జనాలు భయపడి పోతున్నారు. కాగా ఉల్లి ధరలు పెరిగిపోవడంతో ఉల్లి దొంగతనాలు ఊపందుకుంటున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని ఓ గోదాంలో నిల్వ వుంచిన ఉల్లిని దొంగలు దోచుకెళ్లారు. ఈ ఘటనలో ఓ దొంగను అదుపులోకి తీసుకోగా ,మరో దొంగ పరారీలో ఉన్నాడు. రైతులు తెలిపిన వివరాల ప్రకారం…..పూణేలోని దేవజలి గ్రామంలో ఓ […]</p>

దిశ, వెబ్ డెస్క్:
ఉల్లిని… ఒకప్పుడు కోస్తే కన్నీరు వచ్చేది, ఇప్పుడు కొంటే కన్నీరు వస్తోంది. ప్రస్తుతం ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటడంతో దాన్ని కొనాలంటేనే జనాలు భయపడి పోతున్నారు. కాగా ఉల్లి ధరలు పెరిగిపోవడంతో ఉల్లి దొంగతనాలు ఊపందుకుంటున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని ఓ గోదాంలో నిల్వ వుంచిన ఉల్లిని దొంగలు దోచుకెళ్లారు. ఈ ఘటనలో ఓ దొంగను అదుపులోకి తీసుకోగా ,మరో దొంగ పరారీలో ఉన్నాడు. రైతులు తెలిపిన వివరాల ప్రకారం…..పూణేలోని దేవజలి గ్రామంలో ఓ గోదాంలో ఉల్లిని నిల్వ చేశారు. కాగా విషయం తెలుసుకున్న ఇద్దరు దొంగలు బైక్ పై వచ్చారు. గోదాంలో నిల్వ వుంచిన ఉల్లి బస్తాలను చోరీ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నం చేశారు. అయితే స్థానికుడు ఒకరు ఈ విషయాన్ని గమనించి కేకలు వేశాడు. దీంతో వారు తప్పించుకునేందుకు ప్రయత్నించగా ఒక దొంగను స్థానికులు పట్టుకున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. అయితే గోదాంలో నిల్వ వుంచిన 10 బస్తాల ఉల్లిని దోచుకుపోయినట్టు గుర్తించారు.






