- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెరువు గట్టుపై హుండీ చోరీ.. పనిచేయని సీసీ కెమెరాలు
<p>దిశ, నకిరేకల్: ప్రముఖ పుణ్యక్షేత్రం చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంపై శనివారం రాత్రి హుండీ చోరీ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… గట్టు పైన ఉన్న మూడు గుండ్ల చోట ఉన్నటువంటి హుండీని గుర్తుతెలియని వ్యక్తులు తాళం పగలకొట్టి చోరీ చేశారు. హుండీలో భక్తులు సమర్పించిన కానుకలు కొంతమేర ఎత్తుకెళ్లి మిగతా కానుకలను వదిలేసి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న దేవస్థానం సిబ్బంది, పాలకవర్గ సభ్యులు సంఘటనా స్థలానికి […]</p>

దిశ, నకిరేకల్: ప్రముఖ పుణ్యక్షేత్రం చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంపై శనివారం రాత్రి హుండీ చోరీ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… గట్టు పైన ఉన్న మూడు గుండ్ల చోట ఉన్నటువంటి హుండీని గుర్తుతెలియని వ్యక్తులు తాళం పగలకొట్టి చోరీ చేశారు. హుండీలో భక్తులు సమర్పించిన కానుకలు కొంతమేర ఎత్తుకెళ్లి మిగతా కానుకలను వదిలేసి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న దేవస్థానం సిబ్బంది, పాలకవర్గ సభ్యులు సంఘటనా స్థలానికి వెళ్లగా తాళం పగులగొట్టి ఉంది. దీంతో మిగిలిన కానుకలను తీసుకొని వెళ్లారు. పవిత్రమైన పుణ్యక్షేత్రంలో సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ఈ విధంగా జరిగిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చోరీ గురించి పోలీసులకు తెలియజేయగా పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. హుండీ ఉన్నటువంటి స్థలంలో సీసీ కెమెరా పని చేయటం లేదని విశ్వసనీయ సమాచారం ద్వారా తెలిసింది. సీసీ కెమెరాలు పనిచేయకుండా ఉన్నప్పటికీ సిబ్బంది, పాలకవర్గ సభ్యులు పట్టించుకోకపోవడం ఈ ఘటనకు కారణంగా చెబుతున్నారు. సిబ్బంది సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఇటువంటి ఘటనలు చోటుచేసుకోవని సిబ్బందిపై చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఏదేమైనప్పటికీ గట్టుపైన సరైన పర్యవేక్షణ లేదని ఈ ఘటనతో తెలిసిపోతుంది. గత కొంత కాలంగా పాలకవర్గ సభ్యులు, సిబ్బంది మధ్య ఉన్నటువంటి బేధాభిప్రాయాలు ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోవడానికి కారణంగా చెప్పొచ్చు.






