- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జగిత్యాల జిల్లాలో దొంగల బీభత్సం.. పోలీసుల నిర్లక్ష్యమే కారణమా..?
<p>దిశ, జగిత్యాల: గత కొద్ది రోజులుగా జగిత్యాల జిల్లాలో తాళం వేసిన ఇళ్లలో దొంగలు చొరబడి నానా బీభత్సం సృష్టిస్తున్నారు. తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగలు విరుచుకుపడడంతో ఇంటి యజమానులు భయాందోళనకు గురి అవుతున్నారు. గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న ఈ దొంగల బీభత్సంపై పట్టణ ప్రజల నుండి ఆందోళన వ్యక్తం అవుతోంది. విద్యా నగర్ కు చెందిన నారాయణ అనే వ్యక్తి కుటుంబంతో సహా 15 రోజుల క్రితం ఇంటికి తాళం వేసి […]</p>

దిశ, జగిత్యాల: గత కొద్ది రోజులుగా జగిత్యాల జిల్లాలో తాళం వేసిన ఇళ్లలో దొంగలు చొరబడి నానా బీభత్సం సృష్టిస్తున్నారు. తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగలు విరుచుకుపడడంతో ఇంటి యజమానులు భయాందోళనకు గురి అవుతున్నారు. గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న ఈ దొంగల బీభత్సంపై పట్టణ ప్రజల నుండి ఆందోళన వ్యక్తం అవుతోంది. విద్యా నగర్ కు చెందిన నారాయణ అనే వ్యక్తి కుటుంబంతో సహా 15 రోజుల క్రితం ఇంటికి తాళం వేసి హైదరాబాద్ వెళ్లాడు. తిరిగి శనివారం రాత్రి ఇంటికి వచ్చేసరికి వేసిన తాళం వేసినట్టే ఉంది. తాళం తీసి చూడగా లోపల గదులు తాళాలు పగలగొట్టి ఉండటంతో, బీరువా ఓపెన్ చేసి వస్తువులను చిందరవందరగా ఉండడంతో ఆందోళన చెంది, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం సహాయంతో వివరాలు సేకరిస్తున్నారు.
జిల్లాలో ప్రతి రోజు రాత్రి పూట ఏదో ఒక చోట దొంగలు దోపిడీకి యత్నిస్తున్న ఘటనల నేపథ్యంలో ఇంటి యజమానులు తమ దగ్గర ఉన్న నగదు, నగలను వెంట తీసుకువెళ్తున్నప్పటికీ గుర్తు తెలియని వ్యక్తులు ఇంటిలో చొరబడిన ఘటనలపై ఆందోళన చెందుతున్నారు. జిల్లా కేంద్రంలో ఇంత జరుగుతున్నా దొంగల ముఠాను పట్టుకోవడంపై పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

అనుమానిత వ్యక్తులపై నిఘా కరువు..
పట్టణంలో అన్ని వార్డుల్లో కలియ తిరిగే బ్లూ కోట్ పోలీస్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల దోపిడికి పాల్పడుతున్న ముఠా పట్టుబడ్డడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదే అదనుగా చిల్లర దొంగలు జిల్లా కేంద్రంలో ఏదో ఒకచోట ప్రతి రాత్రి విరుచుకుపడుతూ ఉండడంతో ప్రజలు అభద్రత పరిస్థితిని వ్యక్తం చేస్తున్నారు. సొంత ఊర్లకో, మహా నగరాల్లో వైద్యం కోసం వెళ్లే ఇంటి యజమానులు దోపిడీ దొంగల బెడద వల్ల పరిస్థితి గందరగోళం మారిందని వాపోతున్నారు. అన్ని కూడళ్లలో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ నేరస్థులను పట్టుకోకపోవడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అభద్రతాభావంలో…
తాళం వేసి ఊరికి వెళ్లిన ఇంటి యజమానులు తెల్లవారితే తమ ఇల్లు జాగ్రత్తగా ఉందో లేదోనని అభద్రతాభావంను వ్యక్తం చేస్తున్నారు. ఇంటి యజమానులు తాళం వేసిన ఇళ్లలో ఎలాంటి నగా, నట్రా ఉంచకుండా వెళ్తున్నప్పటికీ దొంగల బెడదపై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా పోలీస్ అధికారులు పట్టణంలో రాత్రి పూట గస్తీని పెంచి దోపిడీ దొంగల బెడదను అరికట్టేందుకు కృషి చేయాలని కోరుతున్నారు.






