- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘మణప్పురం’లో చోరీకి యత్నం
by Batti.Sumithra |
<p>దిశ, మేడ్చల్ : మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పోలీసుస్టేషన్ పరిధిలోని కొంపల్లిలో మంగళవారం అర్ధరాత్రి కొందరు దుండగులు మణప్పురం బ్రాంచిలో చోరీకి యత్నించారు. పోలీసుల కథనం ప్రకారం .. అర్ధరాత్రి సమయంలో మణప్పురం బ్రాంచ్ గోడకు కన్నం వేసి బంగారం దోచుకెళ్లేందుకు దుండగులు యత్నించారు. కానీ అక్కడి సీసీ కెమెరాలు ప్రధాన కార్యాలయానికి అనుసంధానమై ఉండడంతో గమనించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సీసీ కెమెరాలను గుర్తించిన దుండగులు అక్కడ్నుంచి వెంటనే పరారయ్యారు. ఈ ఘటనపై […]</p>
దిశ, మేడ్చల్ :
మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పోలీసుస్టేషన్ పరిధిలోని కొంపల్లిలో మంగళవారం అర్ధరాత్రి కొందరు దుండగులు మణప్పురం బ్రాంచిలో చోరీకి యత్నించారు. పోలీసుల కథనం ప్రకారం .. అర్ధరాత్రి సమయంలో మణప్పురం బ్రాంచ్ గోడకు కన్నం వేసి బంగారం దోచుకెళ్లేందుకు దుండగులు యత్నించారు. కానీ అక్కడి సీసీ కెమెరాలు ప్రధాన కార్యాలయానికి అనుసంధానమై ఉండడంతో గమనించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సీసీ కెమెరాలను గుర్తించిన దుండగులు అక్కడ్నుంచి వెంటనే పరారయ్యారు. ఈ ఘటనపై మణప్పురం సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Tags: manappuram gold loan shop, thief, kompally, cc cameras
Next Story






