బన్నీ ‘పుష్ప’ అప్‌డేట్..

by  |
బన్నీ ‘పుష్ప’ అప్‌డేట్..
X

దిశ, వెబ్‌డెస్క్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీ తర్వాత బన్నీ చేస్తోన్న చిత్రం ‘పుష్ప’. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ చిత్రం షూటింగ్ కరోనా మహమ్మారి కారణంగా ఆగిపోయింది. ఇప్పుడు కొవిడ్ పరిస్థితులు చక్కబడ్డాయి. షూటింగులకు అనుమతులు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అభిమానుల కోసం ‘పుష్ప’ మూవీ యూనిట్ అప్‌డేట్ ఇచ్చింది.

‘పుష్ప’ ప్రీ ప్రొడక్షన్‌ గ్లిమ్స్‌, షూటింగ్‌ అప్‌డేట్‌ను సోమవారం ఉదయం 10 గంటలకు తెలియజేస్తామని ‘పుష్ఫ’ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ అధికారికంగా తెలిపింది. ఈ చిత్రంలో రష్మిక మందన్న కథానాయిక. రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

https://twitter.com/MythriOfficial/status/1325358859226001410


Next Story

Most Viewed