- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీసులకు సవాల్‌గా మారిన వెయ్యి బస్తాల ధాన్యం చోరీ.. స్పెషల్ టీం కూడా..
<p>దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా చరిత్రలో అతిపెద్ద ధాన్యం దొంగతనం కేసు రోజులు గడుస్తున్నా కొలిక్కి రాలేదు. గడిచిన రెండు నెలల కాలంలో నిజామాబాద్ పారిశ్రామిక ప్రాంతంగా పేరున్న సారంగాపూర్, ఖానాపూర్ ప్రాంతాల్లో రైస్ మిల్లు గోదాముల నుంచి సుమారు రూ.40 లక్షలు విలువైన ధాన్యం చోరికి గురైంది. కొందరు రైస్ మిల్లు, గోదాములలో పని చేసే వారు ప్రధాన పాత్ర పోశించి ధాన్యం బస్తాలను గోదాము నుంచి తప్పించారు. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు […]</p>

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా చరిత్రలో అతిపెద్ద ధాన్యం దొంగతనం కేసు రోజులు గడుస్తున్నా కొలిక్కి రాలేదు. గడిచిన రెండు నెలల కాలంలో నిజామాబాద్ పారిశ్రామిక ప్రాంతంగా పేరున్న సారంగాపూర్, ఖానాపూర్ ప్రాంతాల్లో రైస్ మిల్లు గోదాముల నుంచి సుమారు రూ.40 లక్షలు విలువైన ధాన్యం చోరికి గురైంది. కొందరు రైస్ మిల్లు, గోదాములలో పని చేసే వారు ప్రధాన పాత్ర పోశించి ధాన్యం బస్తాలను గోదాము నుంచి తప్పించారు. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు రైస్ మిల్లర్లకు సంబంధించిన గోదాముల్లో ధాన్యం చోరికి గురి కావడంతో రాత్రికి రాత్రే పోలీసులు కేసు నమోదు చేశారు. రైస్ మిల్లులలో తనిఖీలు నిర్వహించి ఎంత మేరకు ధాన్యం చోరికి గురైంది, ఎంత మంది పాత్రదారులని వెతికే పనిలో పడ్డారు పోలీసులు. పెద్ద పెద్ద వ్యాపారస్తులకు సంబంధించిన మిల్లులు కావడంతో కేసును పోలీసుశాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ సూత్రదారులు, పాత్రదారులతో పాటు చోరి చేసిన ధాన్యాన్ని కొనుగోలు చేసిన వారిని పట్టుకోవడం పోలీసులకు కొత్త తలనొప్పులు తెస్తున్నట్లు తెలిసింది.
కేసు నమోదు చేసి పది రోజులపైనే అయ్యింది. అయితే ఈ కేసు కోసం ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. మామూలుగా ఏదైనా వస్తువులు చోరికి గురైతే ఒకరిద్దరు ఉంటే సరిపోతుంది. కానీ వెయ్యి బస్తాలకు పైగా ధాన్యం చోరి జరుగాలంటే మామూలు విషయం కాదు. అందుకు వాహనాలతో పాటు వాటిని మోసే కూలీలు కూడా అవసరం. ఇదే నిజామాబాద్ నగర శివారులోని పారిశ్రామిక వాడల్లో జరిగింది. గోదాముల్లో పని చేసే వారు ఇచ్చిన సమాచారంతో జూన్ 7న మొదలైన రైస్ మిల్లుల గోదాముల చోరీల పరంపర జులై చివరి వారం వరకు జరిగింది. ఒకే ఒక రైస్ మిల్ గోదాములో 28 లక్షల విలువ చేసే వెయ్యి బస్తాల ‘జై శ్రీరాం’ రకం ధాన్యం చోరికి గురైంది. బాధితులు గత నెల 30న ఫిర్యాదు చేయడంతో రెండు సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు.
6వ టౌన్ పోలీసులు దానితో పాటే ఒక రైస్ మిల్ సంఘం రాష్ట్ర నాయకుడి గోదాములోనూ చోరి జరిగింది. అందులో అనాధికార లెక్కల ప్రకారం5 లక్షల ధాన్యం చోరి జరిగిందని ప్రచారం జరుగుతున్నా అంతకన్నా ఎక్కువగానే ధాన్యం పక్కదారి పట్టిందని ఆరోపణలు ఉన్నాయి. రెండు నెలలుగా ధాన్యం చోరి జరుగుతున్నా యజమాన్యాలు గుర్తించడంలో నిర్లక్ష్యమా లేక అందులో ఏదైనా మతలబు ఉందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లక్షలు విలువలు చేసే ధాన్యాన్ని గోదాముల్లో ఉంచినప్పుడు అక్కడ సెక్యూరిటీతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు ఉంటుంది. కానీ రెండు గోదాముల్లో జరిగిన ధాన్యం చోరీని రక్షణ వ్యవస్థలు పట్టించకపోవడంపై అనుమానాలున్నాయి.
ధాన్యం చోరీ కేసులో ఎఫ్ఐఆర్ నమోదైన గంటల్లోనే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ షురూ చేసినట్లు తెలిసింది. అయితే ధాన్యం గోదాముల నుంచి చోరీకి వాడిన వాహనాలతో పాటు హమాలీలను వినియోగించడంతో వారిని పట్టుకోవడం ఇప్పుడు కష్టంగా మారింది. హమాలీలను అమాయకులను చేసి కొందరు గుమాస్తాలు, ప్రధాన సూత్రదారులు కలిసి కూలీలకు పిలిచి ధాన్యం చోరీలో ఇరికించారని ఆరోపణలున్నాయి. ధాన్యం సేకరణ పూర్తయిన తర్వాత మహారాష్ట్ర వెళ్లిపోయిన హమాలీల కొరకు గాలించడం ఈ కేసు పరిశోధనలో కీలకంగా మారింది.
రైస్ మిల్లులలో పని చేసే గుమాస్తాలతో పాటు వారు దొంగిలించిన ధాన్యంను కొనుగోలు చేసిన రైస్ మిల్లర్ల బాగోతం బయట పడడమే కేసు ఛేదనకు కీలకంగా మారింది. ధాన్యంను చోరీ చేసిన వారు రైస్ మిల్లులకు తరలించారని, వారు ఏ ప్రాతిపదికన కొనుగోలు చేశారనేది తేలాల్సి ఉంది. ధాన్యం చోరి చేసిన సూత్రదారులు, పాత్రదారులతో పాటు వాటిని కొనుగోలు చేసిన వ్యక్తులపై కేసుల నమోదులోనూ ఆలస్యమౌతుందన్న కారణాలుగా చెబుతుంది పోలీసు శాఖ. ధాన్యం చోరీ చేసిన వారితో పాటు హమాలీలను కేసులో పాత్రదారులుగా చూపించే అవకాశం ఉండగా చోరి ధాన్యం కొనుగోలు చేసిన వారిపై కేసులో ఉంటారా తప్పిస్తారా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.






