- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పట్టపగలే చోరీ
by Sridhar Babu |
<p>దిశ, హుస్నాబాద్: పట్టపగలే ఓ లైబ్రేరియన్ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. ఎస్సై సజ్జనపు శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం..హుస్నాబాద్ పట్టణానికి చెందిన లైబ్రేరియన్ కోమటి నారాయణ దంపతులు తన కూతురు ఇంటికి మంగళవారం ఉదయం వెళ్లారు. మధ్యాహ్నం ఆ దంపతులు ఇంటికొచ్చేసరికి ఇంటి తాళం పగలగొట్టి ఉంది. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలోని మూడు తులాల బంగారం, రూ.20వేలు నగదును దొంగిలించబడి నట్టు వారు […]</p>

X
దిశ, హుస్నాబాద్: పట్టపగలే ఓ లైబ్రేరియన్ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. ఎస్సై సజ్జనపు శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం..హుస్నాబాద్ పట్టణానికి చెందిన లైబ్రేరియన్ కోమటి నారాయణ దంపతులు తన కూతురు ఇంటికి మంగళవారం ఉదయం వెళ్లారు. మధ్యాహ్నం ఆ దంపతులు ఇంటికొచ్చేసరికి ఇంటి తాళం పగలగొట్టి ఉంది. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలోని మూడు తులాల బంగారం, రూ.20వేలు నగదును దొంగిలించబడి నట్టు వారు గుర్తించారు. దీంతో పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. దీనిపై దర్యాప్త జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.
Next Story






