సంతోషి మాత ఆలయం‌లో భారీ చోరీ

by Shyam |   (  Updated:2021-12-04 00:00:12  IST  )

<p>దిశ, ఎల్బీనగర్ : హస్తినాపురం సంతోషిమాత ఆలయంలోని గర్భగుడిలో శుక్రవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. ఎల్బీనగర్ ఇన్ స్పెక్టర్ అశోక్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అర్ధరాత్రి ఎవరూ లేని సమయంలో సంతోషి మాత ఆలయం లోని సీసీ కెమెరాల వైర్లు కట్ చేసి దుండగులు గర్భగుడి తాళాలు పగలగొట్టి 23 తులాల అమ్మవారి బంగారు ఆభరణాలు చోరీ చేశారు. పూజారి ఉదయం ఆలయంలో దొంగతనం జరిగినట్లు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న [&hellip;]</p>

సంతోషి మాత ఆలయం‌లో భారీ చోరీ
X

దిశ, ఎల్బీనగర్ : హస్తినాపురం సంతోషిమాత ఆలయంలోని గర్భగుడిలో శుక్రవారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. ఎల్బీనగర్ ఇన్ స్పెక్టర్ అశోక్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అర్ధరాత్రి ఎవరూ లేని సమయంలో సంతోషి మాత ఆలయం లోని సీసీ కెమెరాల వైర్లు కట్ చేసి దుండగులు గర్భగుడి తాళాలు పగలగొట్టి 23 తులాల అమ్మవారి బంగారు ఆభరణాలు చోరీ చేశారు. పూజారి ఉదయం ఆలయంలో దొంగతనం జరిగినట్లు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. క్లూస్ టీం ను రంగంలోకి దింపి వేలిముద్రలను సేకరిస్తున్నారు. మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story