లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో చోరి..!

by Batti.Sumithra |

<p>దిశ, మాక్లూర్: మాక్లూర్ మండలంలోని చిక్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో గుర్తుతెలియని దుండగులు దొంగతనానికి పాల్పడినట్టు ఆనవాళ్లు స్థానికంగా కలకలం రేపాయి. ఆలయ ప్రధాన ద్వారం తాళాలను ఇనుప రాడ్డు సాయంతో తీసినప్పటికీ రెండో తాళం బ్రేక్ చేయడం వీలు కాలేదు. దీంతో ఆలయం బయట ఉన్న హుండీని ధ్వంసం చేసి, దొంగతనానికి యత్నించారు. శుక్రవారం ఉదయం గుడిని శుభ్రం చేసే భుక నారాయణ దొంగతనం జరిగిందని గ్రామస్తులకు తెలియజేశాడు. గ్రామస్తులు స్థానిక పోలీస్ స్టేషన్‌కు [&hellip;]</p>

లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో చోరి..!
X

దిశ, మాక్లూర్: మాక్లూర్ మండలంలోని చిక్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో గుర్తుతెలియని దుండగులు దొంగతనానికి పాల్పడినట్టు ఆనవాళ్లు స్థానికంగా కలకలం రేపాయి. ఆలయ ప్రధాన ద్వారం తాళాలను ఇనుప రాడ్డు సాయంతో తీసినప్పటికీ రెండో తాళం బ్రేక్ చేయడం వీలు కాలేదు. దీంతో ఆలయం బయట ఉన్న హుండీని ధ్వంసం చేసి, దొంగతనానికి యత్నించారు. శుక్రవారం ఉదయం గుడిని శుభ్రం చేసే భుక నారాయణ దొంగతనం జరిగిందని గ్రామస్తులకు తెలియజేశాడు. గ్రామస్తులు స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆలయం వెలుపల పరిశీలించారు. విచారణ వేగవంతం చేస్తామన్నారు. ఇప్పటివరకు చాలా సార్లు ఈ లక్ష్మీ నరసింహ స్వామి గుడిలో దొంగలు పడ్డారని గ్రామస్తులు చెబుతున్నారు. రాత్రి సమయంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించకపోవడంతోనే దొంగతనాలు పెరిగాయని స్థానికులు విమర్శలు చేస్తున్నారు.

Next Story