పీపీఈ కిట్లతో దొంగతనం

2

దిశ, వెబ్‎డెస్క్ : పీపీఈ కిట్లను ధరించి దొంగతనానికి పాల్పడ్డారు దుండగులు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వి.కోట మండల కేంద్రంలో ఓ జ్యువెలరీ షాపు గోడకు కన్నం పెట్టి నగలను దోచుకెళ్లారు. పీపీఈ కిట్లను ధరించి దొంగతనానికి వెళ్లిన దొంగలు.. తమ దృశ్యాలు రికార్డు కాకుండా సీసీ కెమెరాకు కవర్ చుట్టారు. షాపు యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.