- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బావిలో పడిన యువకుడు.. సాహసం చేసిన ఎస్‌ఐ
by Shyam |
<p>దిశ, తాండూరు : బావిలో దూకిన యువకుడు గల్లంతైన ఘటన తాండూర్ మండలంలోని కొత్లపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన ప్రకారం.. అదే గ్రామానికి చెందిన ఆర్.నర్సింలు(30) అనే యువకుడు.. స్థానికంగా ఉన్న శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం సమీపంలో ఉన్న బావిలోకి దూకాడు. యువకుడు ఆచూకీ కోసం ఎంత వెతికిన లాభం లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన కరణ్‌కోట్ ఎస్సై ఏడుకొండలు మోటార్ సహాయంతో బావిలో ఉన్న కొద్దీ నీటిని ఖాళీ […]</p>

X
దిశ, తాండూరు : బావిలో దూకిన యువకుడు గల్లంతైన ఘటన తాండూర్ మండలంలోని కొత్లపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన ప్రకారం.. అదే గ్రామానికి చెందిన ఆర్.నర్సింలు(30) అనే యువకుడు.. స్థానికంగా ఉన్న శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం సమీపంలో ఉన్న బావిలోకి దూకాడు. యువకుడు ఆచూకీ కోసం ఎంత వెతికిన లాభం లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు.
రంగంలోకి దిగిన కరణ్‌కోట్ ఎస్సై ఏడుకొండలు మోటార్ సహాయంతో బావిలో ఉన్న కొద్దీ నీటిని ఖాళీ చేయించారు. యువకుడు ఆచూకీ కోసం తీవ్రంగా గాలించాడు. అయితే అప్పటికే యువకుడు మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని వెలికి తీసేందుకు ఎవరు ముందుకు రాకపోవడంతో ఎస్సై తాడు సహాయంతో తానే స్వయంగా బావిలోకి దిగి మృత దేహాన్ని వెలికి తీశారు. దీంతో ఎస్సై చేసిన సాహసోపేత నిర్ణయానికి పలువురు ఆశ్చర్యానికి గురయ్యారు.
Next Story






