- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సూర్యాపేటలో దారుణం.. నడిరోడ్డుపై యువకుడ్ని కిరాతకంగా నరికి..
by Batti.Sumithra |
<p>దిశ, తుంగతుర్తి: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తిపై గుర్తుతెలియని వ్యక్తులు కిరాతకంగా కత్తులతో దాడి చేశారు. ఈ ఘటన మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నాగారం మండల కేంద్రానికి చెందిన కన్నెబోయిన మధు(25) మంగళవారం సాయంత్రం ఓ పనిమీద ఇంట్లో నుంచి బయటకొచ్చాడు. బండి రోడ్డు పక్కన ఆపి నిల్చున్నాడు. దీంతో ఒక్కసారిగా గుర్తుతెలియని దుండగులు మధుపై విచక్షణారహితంగా కత్తులతో దాడి చేశారు. యువకుడి మెడ భాగంలో దారుణంగా […]</p>

X
దిశ, తుంగతుర్తి: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తిపై గుర్తుతెలియని వ్యక్తులు కిరాతకంగా కత్తులతో దాడి చేశారు. ఈ ఘటన మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నాగారం మండల కేంద్రానికి చెందిన కన్నెబోయిన మధు(25) మంగళవారం సాయంత్రం ఓ పనిమీద ఇంట్లో నుంచి బయటకొచ్చాడు. బండి రోడ్డు పక్కన ఆపి నిల్చున్నాడు. దీంతో ఒక్కసారిగా గుర్తుతెలియని దుండగులు మధుపై విచక్షణారహితంగా కత్తులతో దాడి చేశారు. యువకుడి మెడ భాగంలో దారుణంగా నరికారు. దీంతో మధు తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని బాధితున్ని ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్టున్నట్లు ఎస్ఐ హరికృష్ణ తెలిపారు.
Next Story






