- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బావిలో పడి యువకుడు మృతి
<p>దిశ, కోదాడ: బావిలో పడి యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని అమీనాబాద్ గ్రామ శివారులో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన చిన్నపంగు పుల్లయ్య, నాగమ్మ దంపతుల చిన్న కుమారుడు కిషోర్(17) సోమవారం రాత్రి నుంచి కనిపించక పోవడంతో, ఆందోళన చెందిన కుటుంబసభ్యులు బంధువుల, తెలిసిన వాళ్ల ఇంట్లో వెతికారు. అమీనాబాద్ నుంచి త్రిపురవరం పోయే మార్గంమధ్యలో పాయిలి గురుస్వామి అనే రైతు పొలం గట్టున, కిషోర్ ఫోన్ దొరికిందని, […]</p>

X
దిశ, కోదాడ: బావిలో పడి యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని అమీనాబాద్ గ్రామ శివారులో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన చిన్నపంగు పుల్లయ్య, నాగమ్మ దంపతుల చిన్న కుమారుడు కిషోర్(17) సోమవారం రాత్రి నుంచి కనిపించక పోవడంతో, ఆందోళన చెందిన కుటుంబసభ్యులు బంధువుల, తెలిసిన వాళ్ల ఇంట్లో వెతికారు.
అమీనాబాద్ నుంచి త్రిపురవరం పోయే మార్గంమధ్యలో పాయిలి గురుస్వామి అనే రైతు పొలం గట్టున, కిషోర్ ఫోన్ దొరికిందని, కొందరు గ్రామస్తులు గ్రామ సర్పంచ్ ముత్తినేని కోటేశ్వరరావుకు సమాచారం అందించారు. దీంతో అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది బాలుడి మృతదేహాన్ని వెలికి తీశారు. కుమారుని మరణవార్త తెలిసిన తల్లిదండ్రుల రోదన అందరినీ కంటనీరు తెప్పించింది.
Next Story






