కరోనా పాజిటివ్ వచ్చిందని యువకుడు ఏం చేశాడంటే?

95

దిశ, నర్సంపేట : కరోనా సోకిందని తీవ్ర మనస్తాపానికి గురై ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన నర్సంపేట పట్టణం‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… నర్సంపేట బస్టాండ్ కి సమీపంలో సందీప్ (30) అనే యువకుడు సెల్ షాప్ నిర్వహిస్తున్నాడు. నియోజక వర్గంలో కరోనా విజృంభిన కొనసాగుతుంది ఈ నేపథ్యంలో సందీప్ కరోనా పరీక్ష చేసుకోగా  పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై, శుక్రవారం ఉదయం బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సందీప్ మృతితో పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..